Abn logo
Sep 19 2020 @ 02:11AM

‘ఆహారం ద్వారా కరోనా’.. ఆధారాల్లేవ్‌

నిపుణుల కమిటీ  నివేదించింది: లోక్‌సభలో కేంద్రం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: ఆహారం ద్వారా కరోనా వ్యాపిస్తుందనేందుకు ఇప్పటివరకైతే ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభకు నివేదించింది. భారత ఆహార భద్రత-ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) నిపుణుల బృందంతో ఏర్పాటు చేసిన కమిటీ ఈ మేరకు నిర్ధారించిందని పేర్కొంది.  ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబె లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.


కాగా, దేశంలో మొత్తం 30 కంపెనీలు టీకా ప్రయోగా ల్లో ఉన్నాయని.. మూడు సంస్థలు క్లినికల్‌ ట్రయల్స్‌ వరకు వచ్చాయని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌  తెలిపారు. నాలుగు కంపెనీలు ప్రి క్లినికల్‌ దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. టీకా ఆవిష్కరణ తర్వాత పంపిణీకి సంబంధించిన వ్యవహారాలపై ఉన్నతాధికారుల కమిటీ పరిశీలన చేస్తోందన్నారు. మరోవైపు ప్రస్తుతం దేశంలోని అర్బన్‌, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో వైరస్‌ విస్తృతి ఎక్కువగా ఉందని చౌబె వివరించారు.


రష్యా టీకాకు సంబంధించిన పురోగతిని తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు.  ఐసీఎంఆర్‌ భాగస్వామ్యంతో భారత్‌ బయోటెక్‌ చేపట్టిన, క్యాడిలా హెల్త్‌ కేర్‌ నిర్వహించిన తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ అద్భుత ఫలితాలిచ్చాయన్నారు. ఈ రెండు సంస్థల రెండో దశ ట్రయల్స్‌ సాగుతున్నట్లు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఏప్రిల్‌- జూన్‌ మధ్య నవజాత శిశువులకు హైపటైటి్‌స-బి టీకా ఇవ్వడంలో 19.4 శాతం తగ్గుదల నమోదైందని తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement