బెల్టుషాపులతో పొంచి ఉన్న కరోనా ముప్పు

ABN , First Publish Date - 2020-07-08T10:14:08+05:30 IST

కల్లూరు మండలం రఘునాథబంజర్‌ గ్రామపంచాయతీ పరిధిలో ఆంధ్రా సరిహద్దునగల ప్రధాన రహదారి వెంట..

బెల్టుషాపులతో పొంచి ఉన్న కరోనా ముప్పు

కల్లూరు, జూలై 7: కల్లూరు మండలం రఘునాథబంజర్‌ గ్రామపంచాయతీ పరిధిలో ఆంధ్రా సరిహద్దునగల ప్రధాన రహదారి వెంట బెల్టుషాపులు విచ్చలవిడిగా వెలిశాయి. కరోనా మహామ్మారి విజృంభిస్తున్న సమయంలో సరిహద్దు ప్రాంతంలోగల రఘునాథబంజర్‌, రఘునాథగూడెం పరిసర గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఆంధ్రాలోని తిరువూరులో కరోనా విలయతాండవం చేస్తుంది. అక్కడ బెల్టుషాపులను ఎత్తివేయటంతో ఆప్రాంతానికి చెందిన వందలాదిమంది మద్యంప్రియులు సరిహద్దున వెలిసిన బెల్టుషాపులకు వచ్చి విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్నారు.


సర్పంచ్‌ కుక్కా అంజన్‌రావు ఆధ్వర్యంలో పాలకవర్గం కరోనా మహమ్మారి దృష్ట్యా ఈబెల్టుషాపులను మూసివేయాలని ఏకగ్రీవంగా తీర్మానించిన, పోలీస్‌, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఏమాత్రం అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ-ఆంధ్రా సరిహద్దు గ్రామాల మధ్య నిత్యం రాకపోకలు కొనసాగుతుండటంతో కరోనా వైరస్‌ ప్రమాదం పొంచి ఉందని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కరోనా అదుపులోకి వచ్చేవరకు ఈ బెల్టుషాపులను మూసివేసేవిధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ పాలకవర్గం, ప్రజలు అధికారులను కోరుతున్నారు.

Updated Date - 2020-07-08T10:14:08+05:30 IST