Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘మూడో’ ముప్పు ఉండకపోవచ్చు!!

డెల్టా ప్లస్‌ వేరియంట్‌ ప్రమాదకారి కాదు..

కొత్త వేరియంట్స్‌ వస్తేనే ఇబ్బంది

ప్రజారోగ్య చర్యలతోనే వైర్‌సకు చెక్‌  

పక్క రాష్ట్రాలలో పెరుగుతున్న కేసులు  

కేసులు బాగా తగ్గితే.. నాన్‌-కొవిడ్‌ సేవలు 

‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు


హైదరాబాద్‌ సిటీ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కరోనా మూడోవేవ్‌ వస్తుందా ? వస్తే.. దాని ఉధృతి ఎలా ఉం డొచ్చు ? డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వ్యాప్తి మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుంది ? అనే దానిపై సర్వత్రా ఆందోళ న వ్యక్తమవుతోంది. రాబోయే ‘మూడో’ గండానికి చెక్‌ పెట్టాలంటే ప్రజలు ఆరోగ్యపరమైన జాగ్రత్త చర్యలను పాటించాల్సి ఉంటుందని వైద్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో వ్యాక్సినేషన్‌ను నిరాటంకంగా కొనసాగించాలని సూచిస్తున్నారు. డెల్టా, డెల్టా ప్లస్‌ తరహా కొత్త కరోనా వేరియంట్లు వ్యాప్తిలోకి వస్తే మాత్రం కొంత ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణలో కరోనా రోగుల చికిత్సకు పెద్ద దిక్కుగా ఉన్న ‘గాంధీ’ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావును ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూ చేసింది. వివరాలివీ.. 


మూడో వేవ్‌ వస్తుందా ? 

వైరస్‌ వేవ్‌లు ఒక దాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. ఈక్రమంలోనే కరోనా 3వ వేవ్‌ కూడా త ప్పకుండా వస్తుంది. అయితే వైరస్‌ వ్యాప్తి, ఇన్ఫెక్షన్‌ తీవ్రత అనేది ప్రజలపైనే ఆధారపడి ఉంటుంది. అజాగ్రత్తగా ఉంటే ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజ లు గుంపులుగా ఉండడం, రద్దీ ప్రాంతాల్లో తిరుగుతుంటుంటే వైరస్‌ కట్టడి కష్టసాధ్యమే.  


మూడో వేవ్‌ చాలా సీరియ్‌సగా ఉంటుందా ? 

కరోనా మూడో వేవ్‌ సీరియ్‌సగా ఉండకపోవచ్చు. మొదటి వేవ్‌లో బాధితులకు చికిత్స ఇవ్వడానికి, వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి వైద్యులకు కొంత సమయం లభించేది. కానీ రెండో వేవ్‌ అలా లేదు. రావడంతోనే చాలా ఉధృతిగా వచ్చింది. భారీగా కేసులు రావడం, వచ్చే వాటిలో సీరియ్‌సవి ఎక్కువగా ఉండటం వల్ల వైద్య వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనైంది. కరోనాలా గతంలో ప్రబలిన మహమ్మారి వైర్‌సలను పరిశీలిస్తే.. వాటి తదుపరి వే రియంట్లతో ఇన్ఫెక్షన్‌ తీవ్రత పెద్దగా ఉండదని తేటతెల్లమైంది. ఒకప్పుడు ప్రపంచా న్ని వణికించిన స్పానిష్‌ వైరస్‌ కూడా వేవ్‌లు గడుస్తున్న కొద్దీ డీలా పడింది. ఇప్పుడు కరోనా వైరస్‌ కూడా దాదాపు అదే మాదిరిగా బలహీనపడొచ్చు.  


కొత్త వేరియంట్స్‌ వస్తే పరిస్థితేంటి? 

ఇప్పుడు వ్యాపిస్తున్న కరోనా వేరియంట్లే.. మూడోవేవ్‌లోనూ ఉంటే పెద్దగా ముప్పు ఉండదు. డెల్టా వేరియంట్‌ సీరియ్‌సగా ఉండకపోవచ్చు. ఇదే డెల్టాప్లస్‌ రూపంలో మాత్రం మైల్డ్‌గా ఉంటుంది. 2వ వేవ్‌లో భారీ సంఖ్యలో ప్రజలు ఇన్ఫెక్ట్‌ అయ్యారు. చాలామంది లో యాంటీబాడీస్‌ వృద్ధిచెందాయి. మరోవైపు వ్యాక్సినేషన్‌ చురుగ్గా సాగుతోంది.  కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. 


‘మూడో’ ముప్పును ఎదుర్కోవడం ఎలా?

వైరస్‌ నియంత్రణలో ప్రజల పాత్రే కీలకం. జనం అలర్ట్‌గా ఉంటే మూడో వేవ్‌కు చెక్‌ పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. వ్యాక్సిన్‌ వేసుకోవడం, భౌతికదూరం పా టించడం, మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రతను అలవర్చుకోవడం, రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోవ డం, అవసరముంటేనే బయటకు రావడం, జనం లేని సమయంలోనే పనులు నిర్వహించుకోవడం అలవర్చుకుంటే ఎన్ని కరోనా వేరియంట్లు వచ్చినా నియంత్రణలో పెట్టొచ్చు. 


రెండో వేవ్‌లో కేసులు తగ్గుముఖం పట్టాయా? 

ప్రస్తుతం కొనసాగుతున్న రెండో వేవ్‌లో పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మన దగ్గర పెరగడం లేదు. అయినా అప్రమత్తంగానే ఉండాలి. బ్లాక్‌ ఫంగస్‌, కొవిడ్‌ సీరియస్‌ కేసులు వస్తూనే ఉన్నాయి. వారికి ఎక్కువ రోజులు చికిత్స అందించాల్సి వస్తోంది. ప్రస్తుతం ప్రతిరోజు ఇలాంటి సమస్యలతో 40 నుంచి 50 మంది గాంధీ ఆస్పత్రిలో చేరుతున్నారు. ప్రస్తుతం కొవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌ కేసులు కలిపి దాదాపు 700 వరకు ఉన్నాయి. బ్లాక్‌ ఫంగస్‌ కే సులు ప్రతిరోజు 15 దాకా వస్తున్నాయి. కొవిడ్‌లో కూడా సీరియస్‌ కేసులు వస్తున్నాయి. వారికి చికిత్స అందించి డిశ్చార్జి చేయడానికి రెండు, మూడు వారాల సమయం పడుతుంది. మల్టీ ఆర్గాన్స్‌ ఇబ్బందులతో వచ్చే కొవిడ్‌ రోగులు కోలుకోవడానికి ఎక్కువ సమ యం పడుతోంది. రోజుకు 20 వరకు డిశ్చార్జిలు ఉంటున్నాయి. 


గాంధీలో నాన్‌ కొవిడ్‌ చికిత్సలు ఎప్పటినుంచి...

ఆలోచిస్తున్నాం. కేసుల తీవ్రతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. ఇంకా కేసులు తగ్గాలి. ప్రతి రోజు 50 వరకు కరోనా కేసులు వస్తుంటుంటే నాన్‌ కొవిడ్‌ చికిత్సలు అందించడం ఇబ్బందిగా ఉంటుంది. పడకలు ఖాళీగా ఉంటున్నాయి, కానీ నాన్‌కొవిడ్‌ చికిత్సలు అం దిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కేసులు తగ్గుముఖం పడితే.. వారం తర్వాత అప్పటి పరిస్థితులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. బ్లాక్‌ ఫంగస్‌, కొవిడ్‌ కేసుల సంఖ్య 300లోపు ఉంటే నాన్‌ కొవిడ్‌ సేవలను అందించేందుకు ప్లాన్‌ చేయొచ్చు. 


Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...