Abn logo
Oct 27 2020 @ 06:30AM

పండుగలకు ముందే ఢిల్లీలో కరోనా మూడవ దశ

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో గడచిన మూడు రోజులుగా రోజుకు 4 వేలకు మించిన కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీనికిముందు సెప్టెంబరులోనూ ప్రతీరోజూ ఇదే తరహాలో కేసులు నమోదవుతూ వచ్చాయి. అప్పుడు దానిని కరోనా రెండవ దశగా గుర్తించారు. తాజాగా శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం అనుకున్నదానికన్నా ముందుగానే ఢిల్లీలో కరోనా మూడవ దశ కనిపిస్తోంది.

మొదట్లో పండుగల సీజన్‌లో కరోనా వ్యాప్తి చెందుతుందని భావించారు. అయితే దానికన్నా ముందుగానే కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనికి వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులకు తోడు వాయు కాలుష్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం గడచిన మూడు రోజుల్లో ఢిల్లీలో మొత్తం 12,338 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనికి ముందు సెప్టెంబరు 15నుంచి 22 మధ్యకాలంలో రోజుకు 4వేల కేసులు నమోదవుతూ వచ్చాయి. తరువాతి కాలంలో కరోనా కేసులు తగ్గుతూ రోజుకు 2100 వరకూ నమోదయ్యాయి. ఇప్పుడు గడచిన వారం రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనిని గమనించిన వైద్య నిపుణులు ఇది కరోనా మూడవ దశగా చెబుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement