భయం... భయం

ABN , First Publish Date - 2020-06-07T07:04:23+05:30 IST

కరోనా ఉధృతంగా వ్యాపిస్తుండటంతో జిల్లా ప్రజలు క్షణం...క్షణం... భయం... భయంగా

భయం... భయం

పంజా విసురుతున్న కరోనా

అనంత నగరాన్ని కుదిపేస్తున్న మహమ్మారి

16 ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు

జిల్లా కేంద్రంలో జనం బెంబేలు

కర్నూలులో చికిత్స పొందుతూ యాడికివాసి మృతి

జిల్లాలో 11కు చేరిన కరోనా మృతుల సంఖ్య


అనంతపురం వైద్యం, జూన్‌ 6 : కరోనా ఉధృతంగా వ్యాపిస్తుండటంతో జిల్లా ప్రజలు క్షణం...క్షణం... భయం... భయంగా గడుపుతున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు సడ లింపులు ఇస్తుండటంతో జనం విచ్చలవిడిగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతో కరోనా పంజా విసురుతోంది.  ప్రధా నంగా జిల్లా కేంద్రంలో ఉధృతి పెరిగింది. గత నాలుగు రోజుల్లోనే అధికారిక వర్గాల సమాచారం మేరకు 29 పాజి టివ్‌ కేసులు వచ్చాయి. మరోవైపు పదుల సంఖ్యలో అను మానితులను క్వారంటైన్‌లకు తరలిస్తున్నారు. జిల్లా కేం ద్రంలో దాదాపు 16 ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో పాతూరు ప్రాంతంలోని కస్తూ ర్బా నగరపాలక బాలికల ఉన్నత పాఠశాల ప్రాంతం, నెం బర్‌-2 ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంతం, ప్రభాకర్‌జీ కాలనీ, ఉమానగర్‌, వినాయకనగర్‌, నీరుగంటి వీధి, గాం ధీబజారులోని బంగారు వీధి, గుత్తిరోడ్డు, ము న్నానగర్‌, సున్నపుగేరి ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. మరో వైపు నగరంలో ఇతర ప్రాంతాల్లో కూడా కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది.


రంగస్వామినగర్‌లో ఆశా వర్కర్‌లకు పాజిటివ్‌ వచ్చింది. ఆర్‌కే నగర్‌లో హైదరాబాదు నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు పాజిటివ్‌ నిర్ధారణ అ యిం ది. తపోవనంలో చెన్నై నుంచి వచ్చిన విద్యార్థికి పా జిటివ్‌ వచ్చింది. హౌసింగ్‌బోర్డులో కూడా ఇద్దరు పోలీ సులకు వచ్చింది. రూరల్‌ కాలనీలలో కక్కలపల్లికాలనీ, పిల్లిగుండ్ల కాలనీ, నారాయణపురం ఎస్సీ కాలనీలలో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇలా దాదాపు 16 ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లా కేంద్రంలో కరోనా సామాజిక వ్యాప్తి చెందిందా అనే అను మానాలు కలుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో జన సందడి అధికంగా ఉండటంతో పాటు ఇతర రాష్ర్టాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో అధిక మంది జిల్లా కేంద్రానికి చెం దిన వారే. దీంతో పాజిటివ్‌ కేసులు అమాంతంగా పెరుగు తున్నాయి. దీంతో ఒక్కసారిగా ఇటు జనం, అటు అధికార వర్గాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యం లో రాత్రివేళల్లో ఏ కాలనీకి అంబులెన్స్‌ వస్తుందో... ఎవరి ని కొవిడ్‌ ఆస్పత్రికి తరలిస్తుందోనన్న భయాందోళనలు నగర ప్రజలను వెంటాడుతున్నాయి.  


వారంలో ముగ్గురు బలి

జిల్లాలో వారంలోనే కరోనాకు ముగ్గురు బలయ్యారు. జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధి మేనత్త అనారోగ్యం తో కిమ్స్‌ సవీరా ఆస్పత్రిలో చేరి మృతి చెందారు. ఆమెకు పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ తేలింది. యాడికికి చెందిన ఓ వృద్ధుడు జిల్లా సర్వజనాస్పత్రిలో వారం రోజుల పాటు అ చికిత్స పొందాడు. చనిపోయిన తరువాత ఆ వృద్ధుడికి క రోనా పాజిటివ్‌ వచ్చింది. తాజాగా యాడికిలో మరో రెం డు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో కర్నూ లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. మరొకరిని కొవిడ్‌-19 ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు న్నారు. ఇప్పటికే యాడికిలో ఐదుగురికి కరోనా సోకింది.  ఈ ముగ్గురి మృతితో జిల్లాలో కరోనా మరణాల సంఖ్య 11కు చేరింది. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలోని పాతూ రులో మూడ్రోజుల్లో ఇద్దరు మరణించారు. వారు కూడా కరోనాతో మరణించినట్లు జనం చర్చించుకుంటున్నారు. కానీ అధికారులు మాత్రం దీనిపై నోరుమెదపకపోవడం గమనార్హం. 


గ్రంథాలయ శాఖలో రికార్డ్‌ అసిస్టెంట్‌కు నిర్ధారణ

జిల్లా గ్రంథాలయ శాఖలో కరోనా కలకలం రేపింది. ఇప్పటికే ఐసీడీఎస్‌, జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఐసీడీఎస్‌లో మరో ము గ్గురు, నలుగురికి లక్షణాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని చెబుతున్నారు. వైద్యశాఖలోనూ ఏడుగురు క్వారంటైన్‌కు వెళ్లారు. తాజాగా గ్రంథాలయ శాఖలో రికార్డు అసిస్టెం ట్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈయన పాతూరులో నివాసం ఉంటున్నారు. అయితే రోజూ గ్రంథాలయ శాఖ కు విధులకు హాజరవుతూ వచ్చారు. ఇప్పుడు ఆ శాఖ లోని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గ్రంథాలయ శాఖ కార్యాలయంలోనూ శనివారం క్రిమిసంహారక మం దును పిచికారీ చేశారు. ఆ శాఖలో పనిచేస్తున్న పలువురి నుంచి శాంపిళ్లు సేకరించారు. 


నగరంలో మళ్లీ ఆంక్షలా ?

జిల్లా కేంద్రంలో కరోనా కేసులు అమాంతం పెరగడం అధికారయంత్రాంగాన్ని బెంబేలెత్తిస్తోంది. కట్టడి కావాలం టే మళ్లీ ఆంక్షలు తప్పనిసరనే ఆలోచన చేస్తున్నట్లు స మాచారం. ఇదే జరిగితే నరగంలో గతంలో మాదిరిగా ఉ దయం నుంచి 9 గంటల వరకే వ్యాపారాలు, రాకపోకలకు అవకాశం కల్పించే అవకాశం ఉంటుందని ఓ అధికారి తెలిపారు. 

Updated Date - 2020-06-07T07:04:23+05:30 IST