ప్రైమరీ కాంటాక్టులందరికీ పరీక్షలు చేయాలి

ABN , First Publish Date - 2020-05-31T08:13:58+05:30 IST

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారితో కలివిడిగా తిరిగినవారందరి(ప్రైమరీ కాంటాక్ట్‌)కీ కరోనా పరీక్షలు చేయాలని వికారాబాద్‌ జిల్లా కులకచర్లకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు జిల్లా....

ప్రైమరీ కాంటాక్టులందరికీ పరీక్షలు చేయాలి

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు ఓ ఉపాధ్యాయుడి లేఖ 


పరిగి, మే 30: కరోనా పాజిటివ్‌ వచ్చిన వారితో కలివిడిగా తిరిగినవారందరి(ప్రైమరీ కాంటాక్ట్‌)కీ  కరోనా పరీక్షలు చేయాలని  వికారాబాద్‌ జిల్లా కులకచర్లకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు జిల్లా కలెక్టర్‌కు శనివారం లేఖ రాశారు. గుండుమళ్ళ బుచ్చిలింగం కులకచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామంలో  మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు నిర్ధారించారు.  వారికి 100 మందికిపైగా ప్రైమరీ కాంటాక్టులు ఉన్నట్లు చెబుతున్నారు. అక్కడ విందులో పాల్గొన్న వ్యక్తులకు, కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో కలిసి తిరిగిన వారికి  పరీక్షలు చేయకపోవడంతో కులకచర్ల, బండవెల్కిచర్ల, కామునిపల్లి గ్రామాల్లోని జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన  పరిస్థితి ఏర్పడింది.   అందువల్ల పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో సన్నిహితంగా తిరిగిన వారందరికి పరీక్షలు చేయాలని ఆయన కలెక్టర్‌ను కోరారు.  సర్పంచులతో జిల్లా కలెక్టర్‌  శుక్రవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో  బండవెల్కిచర్ల సర్పంచి శిరీష కూడా వారికి కరోనా పరీక్షలు చేయాలని కోరారు. ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం కరోనా పరీక్షలు నిర్వహిస్తారని కలెక్టర్‌ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. 

Updated Date - 2020-05-31T08:13:58+05:30 IST