కరోనా టెస్టులు పెంచి ఆరోగ్యశ్రీలో చేర్చాలి

ABN , First Publish Date - 2020-07-15T11:41:33+05:30 IST

రాష్ట్రంలో కరోనా టెస్టులు పెంచి ఆరోగ్యశ్రీలో చేర్చాలని డీవైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్‌ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు

కరోనా టెస్టులు పెంచి ఆరోగ్యశ్రీలో చేర్చాలి

పెంబి, జూలై 14: రాష్ట్రంలో కరోనా టెస్టులు పెంచి ఆరోగ్యశ్రీలో చేర్చాలని డీవైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్‌ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం చేతులు ఎత్తివేసిందని, కార్పొరేట్‌ ఆసుపత్రులకు పర్మిషన్‌ ఇవ్వడంతో లక్షల రూపాయలు దండుకుంటున్నాయని మండిపడ్డారు. 


పేదలకు కరోనా వస్తే అంత డబ్బు ఎక్కడ నుంచి తేవాలని, అందుకే కరోనా వైద్యం కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆసుపత్రులలో ఫ్రీగా చేయాలని, ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే పేదలకు వైద్యం అందాలంటే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌ యువజన సంఘం మండల అధ్యక్షుడు నల్ల దేవేందర్‌, సంఘ నాయకులు లింగంపల్లి రాజశేఖర్‌, ఉపేందర్‌, నరేష్‌, ప్రవీణ్‌, కట్టరాజు, మనోహర్‌, ప్రశాంత్‌, రాజేంధర్‌, ధర్మరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-15T11:41:33+05:30 IST