గర్భిణులకు కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-05-14T10:42:11+05:30 IST

గర్భిణులలో మనోధైర్యం నింపుతూ, డాక్టర్లు కోవిడ్‌ భయం లేకుండా కాన్పులు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌

గర్భిణులకు కరోనా పరీక్షలు

రేపటి నుంచి రిమ్స్‌ డెంటల్‌ కళాశాలలో ప్రారంభం

కలెక్టర్‌ సి.హరికిరణ్
కడప(కలెక్టరేట్‌), మే13: గర్భిణులలో మనోధైర్యం నింపుతూ, డాక్టర్లు కోవిడ్‌ భయం లేకుండా కాన్పులు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గర్భిణీ మహిళలకు ట్రూ నాట్‌ ల్యాబ్‌ ఆధ్వర్యంలో రిమ్స్‌ డెంటల్‌ ఆసుపత్రి  పరిపాలన భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌ రూమ్‌-2లో ఈ నెల 15 వ తేది నుంచి కోవిడ్‌-19 ఉచిత పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఈ పరీక్షా కేంద్రం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పని చేస్తుందని, ఈ కేంద్రానికి ప్రతి గురువారం సెలవు ఉంటుందని తెలిపారు. కడప నగరంలోని కంటైన్మెంట్‌ జోన్‌లోని  గర్భిణీ మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. పరీక్షలు చేయించుకునేవారు ఆధార్‌కార్డు, నర్సింగ్‌ హోంలు లేదా డాక్టర్లు ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా తేవాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు చేయించుకునేవారికి గైనకాలజీ విభాగం ఆధ్వర్యంలో మొబైల్‌ యూనిట్‌ ద్వారా స్వాబ్‌ తీసి పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు.

Updated Date - 2020-05-14T10:42:11+05:30 IST