ఏడు కోట్లు దాటిన పరీక్షలు

ABN , First Publish Date - 2020-09-27T09:30:38+05:30 IST

కరోనా వైరస్‌ తొలి కేసు (జనవరి 30) నమోదై 8 నెలలు కావొస్తున్న వేళ.. దేశం లో మొత్తం పరీక్షల సంఖ్య ఏడు కోట్లు దాటింది. మరీ ముఖ్యంగా సెప్టెంబరు నెలలో టెస్టుల సంఖ్య భారీగా పెరిగింది...

ఏడు కోట్లు దాటిన పరీక్షలు

  • దేశంలో మరో 85,362 మందికి వైరస్
  • 25వ రోజూ వెయ్యి పైగా మరణాలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: కరోనా వైరస్‌ తొలి కేసు (జనవరి 30) నమోదై 8 నెలలు కావొస్తున్న వేళ.. దేశంలో మొత్తం పరీక్షల సంఖ్య ఏడు కోట్లు దాటింది. మరీ ముఖ్యంగా సెప్టెంబరు నెలలో టెస్టుల సంఖ్య భారీగా పెరిగింది. మధ్యలో కొంత తగ్గినా.. గత వారం రోజుల్లో సగటున రోజుకు 9.80 లక్షల పరీక్షలు చేశారు. గురువారం రికార్డు స్థాయిలో 14.92 లక్షల టెస్టులు నిర్వహించారు. శుక్రవారం రెండో అత్యధికంగా 13.41 లక్షల మందికి పరీక్షలు చేశారు. దేశంలో రికవరీల సంఖ్య మళ్లీ పెరిగింది. శనివారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 93,420 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారని.. ఈ వ్యవధిలో 85,362కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. మరో 1,089 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. కాగా, వరుసగా ఆరు రోజులు 90 వేలలోపే పాజిటివ్‌లు వచ్చాయి. అయితే, ఈ నెలలో ప్రతి రోజూ వెయ్యికి పైనే మరణాలు సంభవించడం గమనార్హం. రికవరీ రేటు 82.14కు చేరిందని, 24 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాం తాల్లో కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారి శాతం అధికంగా ఉంటోందని కేంద్రం వివరించింది. కొత్త రికవరీల్లో 73 శాతం పది రాష్ట్రాల్లోనే నమోదైనట్లు పేర్కొంది. 


మహారాష్ట్రకు సెకండ్‌ వేవ్‌ ముప్పు?

వైరస్‌ పాజిటివ్‌ వచ్చినా లక్షణాలు కనిపించని (అసింప్టమాటిక్‌) వారు ఇళ్లలోనే ఉండాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సూచించారు. జాగ్రత్తలు తీసుకోకుం డా బయటకు వస్తూ ఇతరులకు వ్యాపింపజేస్తే.. సెకండ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉండటంతో ఆయ న అభ్యర్థించారు. మరోవైపు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఆరోగ్యం మెరుపడుతోం ది. 


ఏపీలో 7,293...

ఏపీలో శుక్రవారం మ రో 7,293 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయిందని ఆరో గ్యశాఖ శనివారం ప్రక టించింది. వీటితో కలిపి మొత్తంపాజిటివ్‌లు 6,68,751కి చేరాయి.  రాష్ట్ర వ్యాప్తం గా శని వారం మరో 57మంది మృ త్యువాత పడ్డారు.


నిజంగా ‘సంజీవనే’

కరోనా కాలంలో ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో 12 వేల మంది వైద్యులతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన టెలీ మెడిసిన్‌ కన్సల్టెన్సీ ‘ఈ సంజీవని’ ఓపీడీ వేదిక రోగులకు ఉపయోగపడుతోంది. ఏప్రిల్‌ నుంచి ‘ఈ సంజీవని’ని 4 లక్షల మంది ఉపయోగించుకున్నారని.. వీరిలో 20 శాతం మంది పలుసార్లు సేవలు పొందారని కేంద్రం తెలిపింది. కాగా, ఇందులో లక్ష కన్సల్టేషన్లు గత 18 రోజుల్లోనే నమోదయ్యాయి. మరోవైపు మొత్తం కన్సల్టెన్సీల్లో రెండు లక్షలమంది పైగా తమిళనాడు (1.33 లక్షలు), ఉత్తరప్రదేశ్‌ (లక్ష) వారే ఉండటం గమనార్హం. కేరళ (33,340), ఆంధ్రప్రదేశ్‌ (31,034) నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. వైరస్‌ తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర (7,103), కర్ణాటక (7,684)లలో అతి తక్కువ మంది ఈ సంజీవనిని వినియోగించుకోవడం గమనార్హం. 


Updated Date - 2020-09-27T09:30:38+05:30 IST