సూర్యాపేట కేంద్రంగా కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-07-05T11:11:33+05:30 IST

రోజురోజుకూ కరోనా విజృంభిస్తుండటం, హైదరాబాద్‌లో ప్రభుత్వ పరీక్ష కేంద్రాలపై తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ

సూర్యాపేట కేంద్రంగా కరోనా పరీక్షలు

ప్రతి రోజు 80 నమూనాల పరీక్ష సామర్థ్యం 24గంటల్లో ఫలితాలు


నల్లగొండ, జూలై 4(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రోజురోజుకూ కరోనా విజృంభిస్తుండటం, హైదరాబాద్‌లో ప్రభుత్వ పరీక్ష కేంద్రాలపై తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అవసరాలకు సూర్యాపేట కేంద్రంగా పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శుక్రవా రం నుంచి పరీక్షల ప్రక్రియ ప్రారంభమైంది. రెండు ట్రూనాట్‌ యంత్రా ల ద్వారా పరీక్షలు చేస్తున్నారు. ఒక్కో యంత్రం ద్వారా రోజుకు 40 నమూనాలు పరీక్షించే అవకాశం ఉంది. ఒక్కో యంత్రాన్ని రూ.80 నుంచి రూ.85 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. స్వాబ్‌ పద్ధతిలో సేకరించే నమూనాల ఫలితాలు 24 గంటల్లో వెల్లడిస్తారు. ఈ యంత్రాలతో కరోనా, టీబీ వ్యాధులను ఏకకాలంలో పరీక్షించవచ్చు. అయితే రెండు పరీక్షలు చేయాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

Updated Date - 2020-07-05T11:11:33+05:30 IST