కరోనా టెస్ట్‌.. ఇలా పరీక్ష చేస్తారు!

ABN , First Publish Date - 2020-03-31T06:20:37+05:30 IST

కరోనా వైరస్‌ నిర్థారణ కోసం ప్రత్యేక పరీక్ష చేయవలసి ఉంటుంది. నావెల్‌ కరోనా వైర్‌సను కనిపెట్టే పరీక్షా విధానాన్ని ‘రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ క్వారెంటేటివ్‌...

కరోనా టెస్ట్‌..  ఇలా పరీక్ష చేస్తారు!

కరోనా వైరస్‌ నిర్థారణ కోసం ప్రత్యేక పరీక్ష చేయవలసి ఉంటుంది. నావెల్‌ కరోనా వైర్‌సను కనిపెట్టే పరీక్షా విధానాన్ని ‘రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ క్వారెంటేటివ్‌ పాలిమెరేజ్‌ చైన్‌ రియాక్షన్‌’ అంటారు. ఈ పరీక్ష కోసం....

1. అనుమానిత వ్యక్తి ముక్కు, గొంతు నుంచి ‘శ్వాబ్‌’/నమూనాను సేకరించి, ల్యాబ్‌కు పంపిస్తారు.

2. ‘రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌’ ద్వారా, వైరస్‌ ఆర్‌.ఎన్‌.ఎ (రైబోన్యూక్లియక్‌ యాసిడ్‌)ను డి.ఎన్‌.ఎగా మార్చి, దాన్లోని కొంత భాగాన్ని లక్ష్యంగా చేసుకుని, సూక్ష్మంగా పరీక్షిస్తారు.

3. లక్ష్యంగా చేసుకున్న భాగం పరీక్షలో కొంత వెలుగును విరజిమ్ముతుంది.

4. ఈ వెలుగు తీవ్రతను కంప్యూటరు రికార్డు చేస్తుంది. ఈ ఫలితాన్ని పాజిటివ్‌, నెగటివ్‌ శాంపిళ్లతో సరిపోలుస్తారు.

5. పాజిటివ్‌ శ్యాంపిల్‌ అయిన పక్షంలో, దాన్ని నెగటివ్‌ శ్యాంపిల్‌తో సరిపోల్చినప్పుడు, అది ఎక్కువగా వెలుగును విరజిమ్ముతుంది. 

6. వైరస్‌ రూపం మార్చుకోవడం వల్ల తప్పుడు ఫలితం వెలువడే ప్రమాదం ఉంటుంది కాబట్టి, నూటికి నూరు శాతం కచ్చితత్వం కోసం శాస్త్రవేత్తలు ఒకటికి మించి ఎక్కువ టెస్ట్‌ కిట్స్‌ను ఉపయోగించి, శ్యాంపిళ్లను పరీక్షిస్తారు.


Updated Date - 2020-03-31T06:20:37+05:30 IST