Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 27 Jan 2022 13:02:11 IST

పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి!

twitter-iconwatsapp-iconfb-icon
పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి!

ఆంధ్రజ్యోతి(27-01-2022)

ప్రశ్న: ఈ మధ్యకాలంలో కొవిడ్‌తో బాధపడేవాళ్ల సంఖ్య ఎక్కువయ్యారు. ముఖ్యంగా పిల్లలకూ ఎక్కువగా సోకుతుందని న్యూస్‌ వస్తోంది. నాకో కూతురు ఉంది. అసలు పిల్లల్లో కొవిడ్‌ లక్షణాలను ఎలా గుర్తించాలి? ఎలాంటి లక్షణాలుంటాయి?


- పవిత్ర, ఖమ్మం జిల్లా


డాక్టర్ సమాధానం: ప్రస్తుతం పిల్లలకూ కొవిడ్‌ వస్తోంది. అదృష్టవశాత్తూ ఎవరికీ సీరియస్‌ కావటం లేదు. అధికశాతం పిల్లలు త్వరగా కోలుకుంటున్నారు. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. 


లక్షణాలు ఇలా: హై జ్వరం ఉన్నా, జ్వరం రెండు రోజులున్నా, తలనొప్పి, దగ్గు, జలుబు ఉన్నా జాగ్రత్త పడాలి. బిడ్డ నీళ్లు తాగకున్నా, మత్తుగా ఉన్నా, ఆయాసంగా, వేగంగా గాలిపీల్చుకుంటున్నా, కాళ్లు చేతులు బేలగా ఉన్నా, వాంతులు ఎక్కువ అవుతున్నా, మూలుగుతున్నా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. పిల్లల శరీరంలో దేనికైనా కరోనా సోకచ్చు. గుండె రక్తనాళాలను కూడా తాకొచ్చు. జ్వరంతో పాటు ఒంటిమీద ఎర్రగా, నాలుక, కళ్లు ఎర్రగా ఉండి.. చిరాగ్గా ఉంటే, వేళ్ల చివర తోలు ఊడిపోతున్నా, వాంతులు, విరేచనాలవుతున్నా ఎమర్జెన్సీగా ఆసుపత్రికి వెళ్లాలి. 


ఇలాంటి జాగ్రత్తలు అవసరం: జ్వరమొస్తే కంగారుపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉండే జ్వరం మందు పారాసిటమాల్‌ వేయాలి. రెండు డోసుల మధ్య కనీసం నాలుగు గంటల విరామం ఉండాలి. చల్లనీళ్లలో ముంచిన బట్టతో కాకుండా గోరువెచ్చని నీటిలో ముంచిన బట్టతోనే శరీరంపై అద్దాలి. మీ దగ్గర ఉండే మెఫ్తాల్‌, మెఫ్తాజసిక్‌ లాంటి మందులు వేసేయద్దు. వీటివల్ల జ్వరం వేగంగా తగ్గిపోతుంది. అయితే ఇలాంటి మందులు వాడటం వల్ల  పొట్టలో మంట రావొచ్చు. రక్తవాంతులు కూడా అవ్వచ్చు. ప్లేట్‌రెట్స్‌ పడిపోతాయి. ఆరు నుంచి ఆరేళ్ల వయసు పిల్లలకు ఫిట్స్‌ రావొచ్చు. పిల్లలకు పారసిటమాల్‌ ఇచ్చినా.. జ్వరం 101 డిగ్రీలు ఉంటే డాక్టరును సంప్రదించి ఆచితూచి ఆయన చెప్పిన విధంగానే వేయాలి. అది కూడా ఖాళీ పొట్టన ఇవ్వకూడదు. వాంతులు ఉన్నా ఇవ్వకూడదు. సాధ్యమైనంత వరకూ మెఫ్తాజసిక్‌, మెఫ్తాల్‌ వాడకపోవటమే మంచిది. వాడాల్చొస్తే డాక్టర్‌ సలహా మేరకు  ఐబ్యూజసిక్‌ ఇవ్వాలి. వాంతులవగానే పిల్లవాడికి వెంటనే తినిపించకూడదు. మళ్లీ వాంతులవుతాయి. కాసేపు ఆగి మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ, గంజి, సూప్స్‌ ఇవ్వొచ్చు. ఓఆర్‌ఎస్‌ ఇవ్వాలి. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌మీద ‘డబ్లుహెచ్‌ఓ’ ఉందో లేదో చూసుకోవాలి. మార్కెట్లో చక్కెర ఉండే డ్యూప్లికెట్‌ ఓఆర్‌ఎ్‌సలు ఉన్నాయి. వాంతులు, విరేచనాలు కంటిన్యూగా వస్తే డాక్టరుకు చూపించాలి. జలుబు, దగ్గు ఉండొచ్చు. దిబ్బడగా ఉండి ఊపిరి పీల్చుకోలేకపోతే సెలైన్‌ నోస్‌ డ్రాప్స్‌ ముక్కులో వేయాలి. డైరక్టుగా ఆవివిరి ఇవ్వకూడదు. ఆవిరి నింపి రూమ్‌లో కూర్చొవచ్చు. వాంతులు, వేగంగా గాలి పీల్చుకోలేకపోతే డాక్టరు దగ్గరకు తీసుకెళ్లాలి. దగ్గు మందులను ఉన్నాయని పోయొద్దు.


భయపడాల్సిన అవసరం లేదు: బిడ్డకు కొవిడ్‌ జ్వరం వస్తే.. పెద్ద పిల్లోడైతే రూమ్‌లో పదిరోజులు ఐసొలేషన్‌లో ఉండాలి. చివరి మూడు రోజులు జ్వరం ఉండకూడదు. చంటిపిల్లలైతే తల్లిదండ్రులు పక్కనే ఉండాలి. ఈ జ్వరం వచ్చినా పిల్లలు బాగా కోలుకుంటున్నారు. మూర్ఛకు ప్రథమచికిత్స నేర్చుకుని ఉండాలి. దయచేసి అనవసరంగా మెడికల్‌ షాపులోని మందులు పోయకండి. వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలు త్వరగా కోలుకుంటున్నారు. ఊరికే తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు. 


- డాక్టర్‌ శివరంజని సంతోష్‌Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.