హైదరాబాద్ వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు.. శాంపిళ్లను సేకరించిన వైద్యులు

ABN , First Publish Date - 2020-06-30T21:51:31+05:30 IST

మండలంలోని అంతకపేటలో మేస్త్రి పని చేసే ఓ వ్యక్తి(42) కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. 12 రోజుల క్రితం హైదరాబాద్‌కు సొంత పని మీద వెళ్లి వచ్చినట్లు కుటుంబసభ్యులు

హైదరాబాద్ వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు.. శాంపిళ్లను సేకరించిన వైద్యులు

అంతకపేట, ఏటిగడ్డకిష్టాపూర్‌లో కరోనా భయం!


అక్కన్నపేట/తొగుట: మండలంలోని అంతకపేటలో మేస్త్రి పని చేసే ఓ వ్యక్తి(42) కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. 12 రోజుల క్రితం హైదరాబాద్‌కు సొంత పని మీద వెళ్లి వచ్చినట్లు కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపారు. ఐదు రోజుల నుంచి అస్తమాతో బాధపడుతుండడంతో 26న హుస్నాబాద్‌లోని ఓ వైద్యుడి దగ్గరకు వెళ్లాడు. ఆ వైద్యుడు వరంగల్‌ ఎంజీఎంకు వెళ్లాలని సూచించడంతో అక్కడికి వెళ్లాడు. అక్కడ ఆ వ్యక్తి నుంచి సోమవారం శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం పంపగా, మంగళవారం రిపోర్ట్‌ రానున్నది. అతడిని వరంగల్‌ ఎంజీఎంలోనే క్వారంటైన్‌లో ఉంచారు.  హైదరాబాద్‌ నుంచి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎవరెవరిని కలిశారని వైద్యాధికారులు, సిబ్బంది, పోలీస్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. కుటుంబసభ్యులతో పాటు ఆ వ్యక్తిని కలిసిన వారు మూడు రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. 

 తొగుట మండలం మల్లన్నసాగర్‌ ముంపు గ్రామమైన ఏటిగడ్డ కిష్టాపూర్‌లో కరోనా కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో కుటుంబీకులు రెండు రోజుల క్రితం సిద్దిపేటలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష లు నిర్వహించారు. ఐనప్పటికీ జ్వరం తగ్గకపోవటంతో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి అతడిని ఉస్మానియా ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. అతడి రిపోర్టు రావాల్సి ఉందని తొగుట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు వెంకటేశ్‌ వెల్లడించారు. వైద్యసిబ్బంది గ్రామానికి చేరుకుని అతడు ఎవరెవరితో కాంటాక్ట్‌ అయ్యాడో వివరాలు నమోదు చేసుకున్నారు. 

Updated Date - 2020-06-30T21:51:31+05:30 IST