కరోనా సోకితే మరో ఆరు లక్షణాలు

ABN , First Publish Date - 2020-04-28T15:45:20+05:30 IST

దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు... కరోనా వైరస్‌ సోకిన వారిలో కనిపించే లక్షణాలివి. కానీ వైరస్‌ సోకిన వారిలో ఈ మూడింటితో పాటు మరికొన్ని లక్షణాలు

కరోనా సోకితే మరో ఆరు లక్షణాలు

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 27: దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు... కరోనా వైరస్‌ సోకిన వారిలో కనిపించే లక్షణాలివి. కానీ వైరస్‌ సోకిన వారిలో ఈ మూడింటితో పాటు మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) వెల్లడించింది. కరోనా లక్షణాల జాబితాలో కొత్తగా మరో ఆరింటిని చేర్చింది. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త వహించాలని, వైద్యులను సంప్రదించాలని సూచించింది.


ఈ లక్షణాలు చాలా మందిలో సాఽధారణంగా ఉంటాయని కొంత మందిలో తీవ్ర స్థాయిలో ఉంటాయిని తెలిపింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతిలో నొప్పి, పెదవులు నీలి రంగులోకి మారడం లాంటివి ఎమర్జెన్సీకి  సంకేతాలని, ఈ లక్షణాలు కనిపించిన వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని పేర్కొంది. జలుబు, తుమ్ములు వైరస్‌ లక్షణాలు కావని తెలిపింది. కరోనా సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్న దానిపై స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీకి చెందిన వైద్య బృందం సీడీసీ తరఫున సర్వే నిర్వహించింది. వారి సర్వేలో చాలా మంది తమకు కరోనా పాజిటివ్‌ అని తేలకముందు ఇలాంటి లక్షణాలు కనిపించాయని చెప్పారు.


సీడీసీ కొత్తగా చెప్పిన 6 లక్షణాలు


చలిగా అనిపించడం

వణుకు 

కండరాల నొప్పి

తలనొప్పి

వాసన గ్రహించలేకపోవడం

గొంతు నొప్పి, మంట

Updated Date - 2020-04-28T15:45:20+05:30 IST