వాతావరణ మార్పులకూ లొంగని ‘కరోనా’

ABN , First Publish Date - 2020-08-11T07:46:46+05:30 IST

ఉత్తర అక్షాంశ ప్రాంతంలోని దేశాల్లో మాత్రమే కరోనా విజృంభిస్తోందని.. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే చోట్లలోనే ఇన్ఫెక్షన్లు ప్రబలుతున్నాయని గతంలో జోరుగా ప్రచారం జరిగింది...

వాతావరణ మార్పులకూ లొంగని ‘కరోనా’

లండన్‌, ఆగస్టు 10: ఉత్తర అక్షాంశ ప్రాంతంలోని దేశాల్లో మాత్రమే కరోనా విజృంభిస్తోందని.. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే చోట్లలోనే ఇన్ఫెక్షన్లు ప్రబలుతున్నాయని గతంలో జోరుగా ప్రచారం జరిగింది. ఎండలు దంచికొడితే వైరస్‌ తోక ముడుస్తుందని ఎంతోమంది శాస్త్రవేత్తలు జోస్యం కూడా చెప్పారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేసి.. అన్ని సీజన్లను దాటుకొని.. వైరస్‌ యావత్‌ ప్రపంచానికి పాకింది. ఈనేపథ్యంలో కొవిడ్‌-19 వైరస్‌ వాతావరణ మార్పులకు లొంగే వైర్‌సలా కనిపించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెల్త్‌ ఎమర్జెన్సీస్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ జె.ర్యాన్‌ ప్రకటించారు. ఇన్‌ఫ్లూయెంజా లాంటి వైర్‌సలు ప్రధానంగా చలికాలంలోనే క్రియాశీలంగా మారుతుంటాయని.. కానీ కరోనా వైరస్‌ అందుకు భిన్నంగా అన్ని సీజన్లలోనూ తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతోందని తెలిపారు.

Updated Date - 2020-08-11T07:46:46+05:30 IST