శ్రీకాకుళం: రోనా వైరస్ విజృంభిస్తోంది. కొత్త సంవత్సరంలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ.. సిక్కోలును వైరస్ చుట్టేస్తోంది. జిల్లాలో కేవలం పదిరోజుల్లోనే పది రెట్ల మేర పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో గడిచిన 921 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 20,45,411 నమూనాలు సేకరించగా.. కరోనా బాధితుల సంఖ్య 1,29,939కు చేరింది. వీరిలో చాలామంది కోలుకున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 5,251 మంది, కొవిడ్ ఆస్పత్రుల్లో 128 మంది, కొవిడ్‌కేర్ సెంటర్లలో 10 మంది చికిత్స పొందుతున్నారు. ఆదివారం 259 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇవి కూడా చదవండి