కరోనా ‘పోల్‌’కేక

ABN , First Publish Date - 2021-05-06T08:03:27+05:30 IST

ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్‌ విజృంభించింది. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి అక్కడ కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఏకంగా 530 శాతం...

కరోనా ‘పోల్‌’కేక

  • అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో వైరస్‌ విజృంభణ

న్యూఢిల్లీ, మే 5 : ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్‌ విజృంభించింది. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి అక్కడ కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఏకంగా 530 శాతం మేర పెరిగినట్లు గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. ఏప్రిల్‌ 6 నాటికి కేరళలో 30,228 యాక్టివ్‌ కేసులే ఉండగా,  అదే నెల 21 నాటికి అవి 1.35 లక్షలు దాటాయి. ఇక ఇదే కాలానికి యాక్టివ్‌ కేసులు.. తమిళనాడులో 25వేల నుంచి 84వేలకు, పుదుచ్చేరిలో 1700 నుంచి 5వేలకు, అసోంలో 2వేల నుంచి 9వేలకు, పశ్చిమ బెంగాల్‌లో 12వేల నుంచి 58వేలకు పెరిగాయి.  


Updated Date - 2021-05-06T08:03:27+05:30 IST