బుడతడి నోట కరోనా పాట!

ABN , First Publish Date - 2020-06-27T05:30:00+05:30 IST

చదివేది నాలుగో తరగతి. అయితేనేం తన పాటతో ప్రజల్లో కరోనాపై అవగాహన పెంచేందుకు నడుం బిగించాడు. కొవిడ్‌-19పై ఆ చిన్నారి పాడిన పాట సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌ అవుతోంది...

బుడతడి నోట కరోనా పాట!

చదివేది నాలుగో తరగతి. అయితేనేం తన పాటతో ప్రజల్లో కరోనాపై అవగాహన పెంచేందుకు నడుం బిగించాడు. కొవిడ్‌-19పై ఆ చిన్నారి పాడిన పాట సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఆ బుడతడి పేరు  ప్రణీల్‌. మైసూరులోని సెయింట్‌ జోసెఫ్‌ సెంట్రల్‌ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు. ప్రణీల్‌ తండ్రి ప్రేమ్‌కుమార్‌ ఆల్‌ ఇండియా రేడియోలో పనిచేస్తున్నారు.


ప్రణీల్‌ కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఫోక్‌ స్టయిల్‌లో పాట పాడాడు. కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ‘కిల్లర్‌ కరోనా..’ అంటూ పాడిన ఆ పాటకు నెటిజన్లు ఫిదా అయ్యారు. కరోనాపై గెలవాలంటే జీవనవిధానంలో మార్పులు చేసుకోవాలని, కరచాలనం వద్దని, సీనియర్‌ సిటిజన్లు ఇంటి పట్టునే ఉండాలంటూ పాట చైతన్యపరిచే విధంగా ఉంటుంది. కరోనాపై పోరులో భాగస్వాములైన సోషల్‌ వర్కర్లు, వైద్యసిబ్బందిని ప్రశంసిస్తూ ప్రణీల్‌ పాడిన పాటకు ప్రశంసలు లభిస్తున్నాయి. 

Updated Date - 2020-06-27T05:30:00+05:30 IST