కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలి

ABN , First Publish Date - 2020-07-01T11:03:36+05:30 IST

కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి ప్రజలకు వైద్య పరీక్షలు సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలి

చెస్ట్‌ ఆసుపత్రి ఘటన సుమోటోగా స్వీకరించాలి

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి


జగిత్యాల టౌన్‌, జూన్‌ 30: కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి ప్రజలకు వైద్య పరీక్షలు సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. మంగళ వారం జగిత్యాలలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఆయుష్మాన్‌ భారత్‌, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు పొందడానికి ప్రతి పౌరుడు హక్కు కలిగి ఉన్నాడన్నారు. రాష్ట్రంలో ఇద్దరు కరోనా రోగులు ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ ఆక్సిజన్‌ తొలగించడంతో క్షోభతో మృతి చెందారని, దీనిని మానవ హక్కుల కమిషన్‌  సుమోటోగా స్వీకరించి తక్షణమే రాష్ట్ర ప్రభు త్వంపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. హైదారాబాద్‌లోని చెస్ట్‌ ఆసుపత్రిలో ఇద్దరు వ్యక్తులు సెల్ఫీ వీడియో తీసి ఆస్పత్రిలోని పరిస్థితులను వివరించారన్నారు.


అనంతరం వారు మృతి చెందితే ఎలా జరిగిందని చెప్ప కుండా ఆరోగ్యశాఖ మంత్రి సెల్ఫీ వీడియోను తప్పుబడుతున్నారని పేర్కొ న్నారు. చెస్ట్‌ ఆసుపత్రి ఘటనకు పూర్తి బాధ్యుడు సీఎం కేసీఆర్‌ అని దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా కరోనా వైద్య పరీక్షల కోసం ప్రభుత్వం ప్రకటించిన టారిఫ్‌ను అమలు చేయడం లేదని, గత వారం రోజులుగా కోవిడ్‌ పరీక్షలను రాష్ట్రంలో నిలిపివేశారని, ఇపుడు మళ్లీ మొదలు పెట్టారని అన్నారు.


కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా హైదారాబాద్‌తో సహా అన్ని ప్రాంతాల్లో సాయం త్రం నాలుగు గంటలకు మద్యం దుకాణాలు మూసివేయాలన్నారు. అత్యవస ర సేవలు మినహా కఠిన లాక్‌డౌన్‌ అమలు చేయలన్నారు. సమావేశంలో టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, నాయకులు కొత్త మోహన్‌, గిరి నాగభూషణం, కల్లెపెల్లి దుర్గయ్య, నందయ్య, జగదీశ్వర్‌, భాస్కర్‌రెడ్డి, మహే ష్‌, రాజేందర్‌, రాము, అశోక్‌, రవి, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-01T11:03:36+05:30 IST