కాకినాడ నుంచి తిరిగే బస్సులివే..

ABN , First Publish Date - 2021-05-06T05:56:52+05:30 IST

జిల్లాలో కరోనా రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పకడ్బందీగా జరిగే విధంగా అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి చెప్పారు.

కాకినాడ నుంచి తిరిగే బస్సులివే..

రెండో డోస్‌ వ్యాక్సిన్‌కు ఏర్పాట్లు
డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), మే 5: జిల్లాలో కరోనా రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పకడ్బందీగా జరిగే విధంగా అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి చెప్పారు.  కాకి నాడ నరసన్ననగర్‌ కార్పొరేషన్‌ పాఠశాలలోని వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను కలెక్టర్‌  సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా ఉధృతి దృష్టిలో ఉంచుకుని రెండో డోస్‌ వ్యాక్సిన్‌ పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. వ్యాక్సిన్‌ వేసే ప్రాంతాల్లో రెండో డోస్‌కు వచ్చే వారు ప్రత్యేక మార్గంలో లోపలికి వెళ్లి అక్కడ నమోదై వ్యాక్సిన్‌ వేయించుకుని కొంత సేపు విశ్రాంతి తర్వాత వేరే మార్గంలో బయటకు వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు ఆయా కేంద్రాలలో జరిగాయన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వ్యాక్సిన్‌ కోసం వచ్చే వారి కోసం టెంట్లు వేయించి కుర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏర్పాట్లు స్థానిక సచివాలయాల సెక్రటరీలతో పాటు వలంటీర్లు, పోలీసు పర్యవేక్షణలో జరుగుతున్నాయన్నారు. వ్యాక్సిన్‌ అనేది చాలా ముఖ్యమైనందున ఎక్కడా వృఽధా కాకుండా ఆయా కేంద్రాలలో రద్దీ నియంత్రించే విధంగా ప్రత్యేక బ్యారికేడ్లు ఏర్పాటు చేయించామన్నారు. కేవలం రెండో డోస్‌ మాత్రమే వేయాలని, మొదటి డోసుకు అవకాశం లేదని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-06T05:56:52+05:30 IST