కరోనా పరుగు

ABN , First Publish Date - 2020-07-06T11:48:50+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొత్త ప్రాంతా ల్లోనూ పాజిటివ్‌ కేసులు నమోదు కావడం..

కరోనా పరుగు

జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొత్త ప్రాంతా ల్లోనూ పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.  భీమ డోలు, తాడేపల్లిగూడెంలో పదికి పైబడి ఒకేరోజు కేసులు రావడంతో స్థాని కులు భయాందోళన చెందుతున్నారు. పాజిటివ్‌ నమోదయిన ప్రాంతాల్లో రెడ్‌జోన్‌లు ఏర్పాటు చేసి సూపర్‌ శానిటేషన్‌  చేపడుతున్నారు.


భీమడోలు : మండలవ్యాప్తంగా తాజాగా కరోనా పాజిటివ్‌ కేసులు 13 నమోదైనట్టు పూళ్ళ, గుండుగొలను పీహెచ్‌సీ వైద్యులు లీలా ప్రసాద్‌, కల్యాణ్‌ శ్రీనివాస్‌ తెలిపారు. పూళ్ళ పీహెచ్‌సీ పరిధిలోని పూళ్లలో ఎని మిది, ఎంఎంపురం గ్రామంలో రెండు నమోదయ్యాయి. వీరికి గతంలో పూళ్ల, ఎంఎంపురం గ్రామాల్లో కరోనా సోకినవారి నుంచి ప్రైమరీ, సెకం డరీ కాంటాక్టుల ద్వారా పాజిటివ్‌ సోకినట్టు వైద్యులు తెలిపారు.  గుండు గొలను పీహెచ్‌సీ పరిధిలోని గుండుగొలను, ఆగడాలలంకలో ఒక్కొక్కటి, గుండుగొలు పీహెచ్‌సీ పరిధిలో పని చేస్తున్న భీమడోలుకు చెందిన ఒక ఉద్యోగికి కరోనా సోకినట్టు వైద్యులు గుర్తించారు. 


తాడేపల్లిగూడెం రూరల్‌ : పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. ప్రము ఖులకు కరోనా సోకడంతో వారి సంబంధీకులకు ప్రైమరీ కాంటాక్టు పరీ క్షలు చేశారు. ఈ మేరకు ఆదివారం ఏకంగా 12 మందికి కరోనా సోకి నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జాబితా  వెల్లడించారు. పోలీసులు పట్టణంలో ముమ్మర గస్తీ ఏర్పాటు చేయగా, ఆరోగ్య సిబ్బంది అంతటా సర్వేలు చేస్తున్నారు. తాడేపల్లిగూడెంలోని 6,7,12,23,27 వార్డుల్లో రెడ్‌జోన్‌ ఏర్పాటు చేసినట్టు మునిసిపల్‌ కమిషనర్‌ బాలస్వామి తెలిపారు.


తణుకు : పట్టణంలోని 14వ వార్డు కొమ్మాయి చెరువు గట్టు ప్రాంతంలోని పల్లాలమ్మ నగర్‌ 4వ వీధిలో నివాసముంటున్న ఒక వృద్ధురాలు (66)కి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆమెను ఐసొలేషన్‌కు తరలించి ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి సూపర్‌ శానిటేషన్‌ పనులు నిర్వ హించారు. ఆమెతో కాంటాక్ట్‌లో ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.   


కుక్కునూరు : చీరవల్లిలో తొలి పాజిటివ్‌ కేసు నమోదయింది. గ్రా మంలోని ఒక యువకుడికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఏలూరు తరలించారు. మిగిలిన కుటుంబ సభ్యులను సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉంచారు. ఆ ప్రాంతంలో రెడ్‌ జోన్‌ను ఏర్పాటు చేశారు. 


 ఆకివీడు రూరల్‌ : పెదకాపవరంలో పాజిటివ్‌ కేసు నమోదు అ య్యిందని వైద్యులు సద్దాం హుస్సేన్‌ తెలిపారు. ప్రాథమిక కాంటాక్టులుగా ఎని మిది మంది, సెకండరీగా 17మందిని గుర్తించినట్టు తెలిపారు. 


కాళ్ళ : కాళ్ళలో ఓ యువకుడికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఇటీవల విజయవాడ నుంచి వచ్చిన ఆ యువకుడికి గతనెల 28న కాళ్ళ పీహెచ్‌సీ లో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం ఫలితాల్లో పాజిటివ్‌ రావడంతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. సీసలిలో బెంగళూరు నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులతో కలిపి 16 మందికి వీడిఆర్‌ఎల్‌ టెస్ట్‌లు చేసినట్టు కాళ్ళ పీహెచ్‌సీ వైద్యాధికారి పి.రమామహేశ్వరి తెలిపారు. 


పాలకోడేరు : గరగపర్రు, పాలకోడేరు, కుమదవల్లి, గొరగనమూడిలో   ఒకేరోజు మొత్తం ఐదు పాజిటివ్‌ కేసులు రావడంతో ఆయా గ్రామస్థుల్లో భయాందోళన నెలకుంది. ఆయా ప్రాంతాల్లో సెకండరీ, ప్రైమరీ కాంటాక్టు లిస్టులను వైద్యసిబ్బంది తయారు చేస్తున్నారు.  


ఉంగుటూరు : నారాయణపురంలోని ఒక వ్యక్తికి కరోనా సోకడంతో  ఏలూరు తరలించినట్టు వైద్యాధికారులు తెలిపారు. ఈవో రవి చంద్రకు మార్‌ ఆధ్వర్యంలో గ్రామంలో సూపర్‌ శానిటేషన్‌ చేయించారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను 14 మందిని గుర్తించారు. 


కొవ్వూరు : దొమ్మేరు సావరానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి ఎస్‌.ధర్మరాజు తెలిపారు. పాజి టివ్‌ వచ్చిన వ్యక్తి రాజమండ్రిలో ఒక ప్రముఖ సంస్థలో పని చేస్తున్నాడని అదే సంస్థలో ఇటీవల కొంత మందికి పాజిటివ్‌ నమోదు కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా ఆదివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు.


పెనుమంట్ర : నెగ్గిపూడిలో ఒక వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని మార్టేరు పీహెచ్‌సీ వైద్యుడు కార్తీక్‌ తెలిపారు. మార్టేరుకు చెందిన పోస్టుమాస్టర్‌ అనారోగ్యంతో రాజమండ్రిలో చికిత్స చేయించుకోగా ఆ ఉద్యోగికి పాజిటివ్‌ రావడంతో అతని తల్లిండ్రులకు కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఆదివారం అందిన సమాచారం మేరకు తల్లికి పాజిటివ్‌గా తేలిందన్నారు.


అత్తిలి : అత్తిలి ఎంఎన్‌  స్కూల్‌ రోడ్డులో ఒక పాజిటివ్‌ కేసు నమోద యినట్టు తహసీల్దార్‌ ఏవీ రామాంజనేయులు తెలిపారు. ఇతను పెను మంట్ర పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నట్టు తెలిపారు.


మొగల్తూరు : మొగల్తూరు పోలీస్‌స్టేషన్‌ సమీపంలో గర్భిణి, కోమటి తిప్ప పంచాయతీ పరిధి జిల్లేడుతిప్పలో ఒక మహిళకు కరోనా పాజిటివ్‌ సోకినట్టు ఎంపీహెచ్‌వో కృష్ణ కుమార్‌ తెలిపారు. దీంతో మండలంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 34కి చేరింది.


ఉండి : పాములపర్రు పంచాయతీ పరిధిలోని కొండగూడెం, యండ గండిలో కరోనా కేసులు నమోదు అయ్యాయని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిణి డాక్టర్‌ గౌతమి తెలిపారు.


అత్తిలికి చెందిన ఐదుగురు డిశ్చార్జి

అత్తిలి, జూలై 5: మండలంలో కరోనా పాజిటివ్‌ సోకిన చికిత్స పొం దుతున్న 29 మందిలో ఐదుగురు డిశ్చార్జి అయ్యారని తహసీల్దార్‌ రామాంజనేయులు చెప్పారు. ఆదివారం ఆయన కరోనా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కరోనా పాజిటివ్‌తో అత్తిలి  నుంచి 24 మంది, కొమ్మర నుంచి 3, బల్లిపాడు, ఆరవల్లి నుంచి ఒక్కొక్కరు ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో చేరారని వీరిలో అత్తిలికి చెందిన ఐదుగురు డిశ్చార్జి అయి ఇంటికి వచ్చారన్నారు. పాజిటివ్‌ వ్యక్తులతో కాంటాక్ట్‌ కేసుల నుంచి సేకరించిన శాంపిల్స్‌ ఫలితాలు 230 రావాల్సి ఉందన్నారు. 


కంటైన్మెంట్‌ క్లస్టర్‌, బఫర్‌ జోన్‌గా గుర్తింపు

ఆకివీడు, జూలై 5: కోసూరి వారి వీధిలో ఇటీవల మరణించిన యువకుడికి పాజిటివ్‌ ఉండడంతో ఆ ప్రాంతమంతా కంటైన్మెంట్‌ క్లస్టర్‌, బఫర్‌ జోన్‌గా అధికారులు ప్రకటించారు. సమీపంలోని రహదారులు బంద్‌ చేశారు. కంటైన్మెంట్‌ క్లస్టర్‌, బఫర్‌ పరిధిలోని ప్రైమరీగా-8 మంది (కుటుంబ సభ్యులు), సెకండరీగా-16 మందిని గుర్తించారు. 


45 మందికి ఆరోగ్య పరీక్షలు

పాలకొల్లు టౌన్‌, జూలై 5: పట్టణంలోని ఏడు కంటైన్మెంట్‌ జోన్‌ల పరిఽ దిలో ఏడు వైద్య శిబిరాలను ఆదివారం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిర్వహించారు. శిబిరంల 45 మందికి జ్వర పరీక్షలు నిర్వహించారు.  


నిర్వాసిత  గ్రామాల్లో కరోనా భయం 

కుక్కునూరు, జూలై 5: పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కారణంగా 41.15 కాంటూరు లెవల్లో ముంపునకు గురవుతున్న గ్రామాల్లో ఇటీవల ప్రభు త్వం పునరావాస చర్యలు చేపట్టింది. అర్హులైన వారికి పునరావాస పరిహా రం కల్పించి తరలించే ప్రక్రియ ప్రారంభించింది. దీంతో ఎక్కడెక్కడో ఉద్యో గాలు, జీవన భృతి కోసం వెళ్లిన వారంతా తిరిగి స్వగ్రామాలకు చేరుకుం టున్నారు. వారు వచ్చిన ప్రాంతాల్లో భారీగా కరోనా కేసులు ఉండడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చీరవల్లిలో తొలికేసు నమో దయ్యింది. పోలవరం పునరావాస పరిహారం ప్రక్రియతో నిర్వాసితులంతా కేఆర్‌పురం, కుక్కునూరు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. భౌతిక దూరం పాటించకపోవడం గమనార్హం. ఈ పరిస్థితి కొనసాగితే మరిన్ని కేసులు పెరుగుతాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-07-06T11:48:50+05:30 IST