కరోనా నిబంధనలు తప్పక పాటించాలి

ABN , First Publish Date - 2021-09-18T06:40:41+05:30 IST

విద్యార్థులందరు కరోనా నిభందనలు తప్పకుండా పాటిస్తూ పాఠశాలలకు హా జరు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి మాదవి అ న్నారు.

కరోనా నిబంధనలు తప్పక పాటించాలి
మాస్కులు, నోట్‌బుక్‌లు అందిస్తున్న డీఈవో

జూలపల్లి, సెప్టెంబర్‌ 17 : విద్యార్థులందరు కరోనా నిభందనలు తప్పకుండా పాటిస్తూ పాఠశాలలకు హా జరు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి మాదవి అ న్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలి కల పాఠశాలలను ఆమె శుక్రవారం సందర్శించారు. ఆ పాఠశాలల్లో అమలవుతున్నా మధ్యాహ్న భోజనం ను పరిశీలించారు. ఉపాద్యాయుల హాజరు రిజిష్టర్‌ను పలు రికార్డులను ఆమె పరిశీలించారు. పాఠశాలల్లో నెలకొన్నా సమస్యలపై ఉపాధ్యాయులను అడిగి తెలు సుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కవిత, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొ న్నారు. అలాగే ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు రూ.20వేల నోట్‌బుక్‌లు, మాస్కులు, పెన్నులను జిల్లా విద్యాధికారి పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదే వి, సర్పంచ్‌ల ఫోరం మండల అద్యక్షులు దారబోయిన నర్సింహాయాదవ్‌, వైస్‌ఎంపీపీ రమేష్‌, ఏఎమ్‌వో జగ దీశ్వర్‌, ఎంఈఓ కవిత, లయన్స్‌క్లబ్‌ అధ్యక్షులు సయద్‌ వాజహతుల్లా అయాజ్‌, శశాంక్‌, సాదుల వెంకటేశ్వర్లు, విద్యాకమిటీ చైర్మన్‌ రాజేశ్వరి, ఉపాద్యాయులు, విద్యా ర్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-18T06:40:41+05:30 IST