కరోనా నిబంధనలు తప్పక పాటించాలి: సీఐ

ABN , First Publish Date - 2021-04-17T05:57:39+05:30 IST

పట్టణంలోని టెక్స్‌టైల్స్‌, గార్మెంట్‌, వివిధ వ్యాపార కేంద్రాల నిర్వహకులు కరోనా నిబంధనలు తప్పక పాటించాలని సీఐ శ్యా మరావు పేర్కొన్నారు.

కరోనా నిబంధనలు తప్పక పాటించాలి: సీఐ
పామిడిలో వ్యాపారులతో మాట్లాడుతున్న సీఐ శ్యామరావు

పామిడి, ఏప్రిల్‌ 16: పట్టణంలోని టెక్స్‌టైల్స్‌, గార్మెంట్‌, వివిధ వ్యాపార కేంద్రాల నిర్వహకులు కరోనా నిబంధనలు తప్పక పాటించాలని సీఐ శ్యా మరావు పేర్కొన్నారు. స్థానిక పోలీసు స్టేషనలో శుక్రవారం ఎస్‌ఐ గంగాధర్‌తో కలిసి వ్యాపార కేంద్రాల యజమానులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న ఈ త రుణంలో ఎలాంటి ఏమరపాటు తగదన్నారు. ప్రతిఒక్కరూ షాపులోకి ప్ర వేశించక ముందే శానిటేషన చేయించాలన్నారు. మాస్కు ఉంటేనే అనుమతించాలన్నారు. భౌతికదూరం తప్పకుండా పాటించాలన్నారు. నిబంధనల ను పాటించకపోతే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.   కార్యక్రమంలో షాపుల యజమానులు రుక్మాణ్‌, బీకే రహీం, బీవీ రత్నమ య్య, శ్రీనివాసరావు, చౌడయ్య పాల్గొన్నారు.


మాస్కు లేకుండా థియేటర్లలోకి అనుమతించరాదు

గుత్తి : మాస్కులు లేకుండా ప్రేక్షకులను సినిమా థియేటర్లలోకి అనుమతించరాదని మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో సినిమా థియేటర్ల యజమానులతో ఆయన శుక్రవా రం సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీలో రెండు రోజుల్లో 12 కరో నా పాజిటివ్‌ కేసులు వచ్చాయన్నారు. జాగ్రత్తగా ఉండకపోతే గతేడాది ప రిస్థితి నెలకొంటుందన్నారు. కరోనా నిబంధనలు పాటించాలన్నారు.  ప్రేక్షకుల మధ్య భౌతికదూరం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇనస్పెక్టర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.


యల్లనూరు : మండలంలోని షాపులకు వచ్చే కొనుగోలుదారులు మా స్క్‌లు ధరించకపోతే వస్తువులు ఇవ్వరాదని ఎస్‌ఐ వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానిక వ్యాపారులతో మాట్లాడుతూ కరోనా ఉ ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ నిబంధనలు పాటిస్తూ సహకరించాలన్నారు. మాస్క్‌, శానిటైజర్‌ వాడకం ద్వారా కరోనాను నియంత్రించవచ్చన్నారు. హోటళ్లలో మాస్క్‌లు లేకుంటే అనుమతించరాదన్నారు.


బెళుగుప్ప: ప్రతిఒక్కరు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సీఐ శివశంకర్‌నాయక్‌ పేర్కొన్నారు. స్థానిక పోలీ్‌సస్టేషనలో శుక్రవారం వ్యాపారుల కు కొవిడ్‌పై అవగాహన కల్పించారు. మరోసారి వైరస్‌ ప్రమాదం పొంచి ఉందని, గుంపులుగా ఉండకుండా భౌతికదూరం పాటించాలని సూచించా రు. కార్యక్రమంలో ఎస్‌ఐ హనూర్‌బాషా పాల్గొన్నారు.  


కరోనా వ్యాక్సినపై అపోహలు వద్దు: ఎంపీడీఓ

బొమ్మనహాళ్‌ : కరోనా వ్యాక్సినపై ప్రజలు అపోహలు వీడి ప్రతిఒక్కరు వ్యాక్సిన వేయించుకోవాలని ఎంపీడీవో సరస్వతి తెలిపారు. స్థానిక వెలుగు కార్యాలయంలో రెండు రోజులుగా యానిమేటర్లు, గ్రామ సమాఖ్య లీడర్లకు నిర్వహించిన శిక్షణ తరగతులు శుక్రవారం ముగిసాయి. ఈసందర్భంగా ఆ మె మాట్లాడుతూ టీకా వేయించుకునేలా గ్రామాలలో ప్రతిఒక్కరినీ ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం సురేఖ, ఈవోపీఆర్డీ కుమారరంగ య్య, సీసీలు బాబయ్య, తిప్పేస్వామి, యర్రిస్వామి, వనజ పాల్గొన్నారు. 


యాడికి : వ్యాపారస్తులంతా కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్‌ఐ రాంభూపాల్‌ తెలిపారు. శుక్రవారం పోలీ్‌సస్టేషనలో వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దుకాణాలకు వచ్చే వారు మాస్క్‌లు ధరిస్తూ, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు. 


పెద్దవడుగూరు: ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. స్థానిక పోలీ్‌సస్టేషన ఆవరణలో దుకాణాదారుల తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా సెకెండ్‌ వేవ్‌ ఉధృతి ఎక్కువగా ఉండడంతో దుకాణాలకు వచ్చే కొనుగోలుదారులు మా స్క్‌లు ధరించి, భౌతికదూరం పాటించేలా చూడాలన్నారు.  సమావేశంలో ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


పుట్లూరు: మండలంలోని కేజీబీవీ గురుకుల పాఠశాలలో శుక్రవారం రూరల్‌ సీఐ మల్లికార్జునగుప్త విద్యార్థినులకు శుక్రవారం మాస్కులు పంపిణీచేశారు.  కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు మాస్క్‌లను తప్పనిసరిగా వాడాలన్నారు. జ్వరం, జలుబు చేస్తే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. ఆయన వెంట ఏఎ్‌సఐ రవిప్రసాద్‌, సిబ్బంది ఉన్నారు.


కంబదూరు : ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిం చి కరోనాను అరికట్టాలని ఎస్‌ఐ రాజేష్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక వై ఎ్‌సఆర్‌ సర్కిల్‌ నుండి ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు సిబ్బందితో కలిసి కరోనా ని వారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానికులు అంజి, నీలిశంకరప్ప, కుమార్‌, డాక్టర్‌ వీరేంద్రస్వామి, ఎస్‌ఎండీ ఫయాజ్‌, పంచాయతీ సెక్రెటరీ మహేష్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


రాయదుర్గం రూరల్‌ : కరోనా సోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెలుగు ఏపీడీ ఈశ్వరయ్య పేర్కొన్నారు. శుక్రవారం దుర్గాదేవి సమాఖ్య మండలి కార్యాలయంలో ఏరియా కోఆర్డినేటర్‌ గంగాధర ఆధ్వర్యంలో వీవో లీడర్లు, సీసీలకు సమావేశం నిర్వహించారు. మాస్కులు ధరించి, శానిటైజర్‌తో చేతులు శుభ్రపర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాసమూర్తి, సీసీలు, వీవో లీడర్లు పాల్గొన్నారు. 


తాడిపత్రి టౌన : పట్టణంలో మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న వా హనదారులకు రూ.16300 అపరాధరుసుం విధించామని సీఐ ప్రసాదరావు తెలిపారు. యల్లనూరురోడ్డుసర్కిల్‌, ఆర్టీసీ బస్టాండ్‌ సర్కిల్‌ వద్ద శుక్రవా రం మాస్క్‌లు లేకుండా ప్రయాణిస్తున్న 74 మంది వాహనదారులకు  జరిమానా విధించామని తెలిపారు. ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పా టించాలని ఆయన సూచించారు.


Updated Date - 2021-04-17T05:57:39+05:30 IST