కరోనాను తరిమికొట్టడం సామాజిక బాధ్యత

ABN , First Publish Date - 2021-06-21T05:06:25+05:30 IST

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ సామాజిక బాధ్యత వహించాలని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ ఇలాక్కియా పిలుపునిచ్చారు.

కరోనాను తరిమికొట్టడం సామాజిక బాధ్యత
దివాన్‌చెరువులో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సబ్‌కలెక్టర్‌

  • సబ్‌కలెక్టర్‌ ఇలాక్కియా.. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రం పరిశీలన

దివాన్‌చెరువు, జూన్‌ 20: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ సామాజిక బాధ్యత వహించాలని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ ఇలాక్కియా పిలుపునిచ్చారు. దివాన్‌చెరువులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఆమె ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాక్సిన్‌ వేయించుకోవడం వల్ల ప్రతీఒక్కరిలో రోగనిరోధక శక్తి పెరిగి కరోనా సోకినా ప్రాణాపాయ పరిస్థితులు ఉత్పన్నం కావన్నారు. కరో నా కేసులు తగ్గు ముఖం పడుతున్నాయని తెలిపారు. ప్రజలు మరింత అప్రమ త్తంగా ఉండాలని, పాజిటివ్‌రేటును తగ్గించడంలో ప్రభుత్వ యంత్రాంగం తీసు కుంటున్న చర్యలకు సహకరించాలని చెప్పారు. కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ ఇంటిలోనే ఉంటూ కరోనా వ్యాప్తిని పూర్తిగా అరికట్టడంలో భాగస్వామ్యం వహించాలని సూచించారు. డివిజన్‌ పరిధిలో ఆదివారం 15,800 మందికి వ్యాక్సిన్‌ అందించాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. వ్యాక్సినేషన్‌కు సంబంధిం చిన సమాచారాన్ని సబ్‌కలెక్టర్‌కు రాజానగరం తహశీల్దారు జి.బాలసుబ్రహ్మ ణ్యం వివరించారు. ఆమె పలు సూచనలు, సలహాలు యిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ కోమలి, ఆర్‌ఐ రాజశేఖర్‌, పంచాయితీ కార్యదర్శులు ఎ.సత్తిరాజు. కుమార్‌, కె.వి.భాస్కరరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T05:06:25+05:30 IST