కరోనా నిబంధనలు మరింత కఠినతరం: ఆర్డీవో

ABN , First Publish Date - 2020-03-29T11:07:29+05:30 IST

కోనసీమలో కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా నిబంధనలను మరింత కఠినతరం చేస్తునట్టు ఆర్డీవో

కరోనా నిబంధనలు మరింత కఠినతరం: ఆర్డీవో

అమలాపురం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): కోనసీమలో కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా నిబంధనలను మరింత కఠినతరం చేస్తునట్టు ఆర్డీవో బీహెచ్‌ భవానీశంకర్‌ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసరాలు కొనుగోలు చేయాలన్నారు.  నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు లాఠీచార్జి చేస్తారని హెచ్చరించారు.


చేపల మార్కెట్‌ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేశామన్నారు. అక్కడకు తరలించకపోతే చేపల మార్కెట్‌ మొత్తం బంద్‌ చేస్తామని హెచ్చరించారు. అమలాపురంలో  మంత్రి విశ్వరూప్‌ను కలిసి డివిజన్‌లో తీసుకుంటున్న చర్యలను ఆర్డీవో వివరించారు. ఆక్వా మేతను, చెరువుల వద్దకు తీసుకెళ్లేందుకు వాహనాలకు అనుమతిస్తున్నామన్నారు. వివిధ మాల్స్‌ ద్వారా  నిత్యావసరాలను హోం డెలివరీ చేయడానికి చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు.

Updated Date - 2020-03-29T11:07:29+05:30 IST