పెరుగుతున్న బ్లాక్ ఫంగస్‌ కేసులు.. అవయవాలు కోల్పోతున్న పేషెంట్లు

ABN , First Publish Date - 2021-05-12T01:02:50+05:30 IST

దేశంలో కరోనా సెకండ్ విపరీతంగా విజృంభిస్తోంది. ప్రతి రోజూ లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. వేల మంది చనిపోతున్నారు. అయితే ఈ వైరస్ బారి నుంచి ప్రతి రోజూ అనేక మంది కోలుకుంటున్నారు. కానీ కరోనా నుంచి కోలుకున్నామనే..

పెరుగుతున్న బ్లాక్ ఫంగస్‌ కేసులు.. అవయవాలు కోల్పోతున్న పేషెంట్లు

భోపాల్: దేశంలో కరోనా సెకండ్ విపరీతంగా విజృంభిస్తోంది. ప్రతి రోజూ లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. వేల మంది చనిపోతున్నారు. అయితే ఈ వైరస్ బారి నుంచి ప్రతి రోజూ అనేక మంది కోలుకుంటున్నారు. కానీ కరోనా నుంచి కోలుకున్నామనే ఆనందం కూడా చాలా మందికి లేకుండా పోతోంది. కరోనా నుంచి బయటపడినా.. శరీరంలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లడంతో బ్లాక్ ఫంగస్(మ్యూకోర్‌మైకోసిస్‌) బారిన పడుతున్నారు. దీనివల్ల అనేకమంది ఇప్పటికే శాశ్వత అంధులుగా మారుతున్నారు. మరి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ ఫంగస్‌ బాధితుల కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఢిల్లీ, గుజరాత్‌లలో ఈ ఫంగస్ బాధితుల కోసం ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


తాజాగా ఈ మధ్యప్రదేశ్‌లో కూడా ఈ కేసులు పెరిగిపోతున్నాయి. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఏడు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగుచూశాయి. ఇందులో హామిదియా అనే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు, ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో మరో కేసును వైద్యులు గుర్తించారు. ఆ వ్యాధిని అరికట్టేందుకు హామిదియాలోని ఓ బాధితుడికి సోమవారం శస్త్రచికిత్స నిర్వహించి ఓ దవడను తొలగించారు. మరో బాధితుడికి కంటిని తొలగించారు. మరో నలుగురికి శస్త్రచికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ఈ వ్యాధి బాధితులకు చికిత్స అందించేందుకు భోపాల్‌లోని గాంధీ మెడికల్‌ కళాశాలలో 20 పడకలతో ప్రత్యేక వార్డును రూపొందిస్తున్నారు. 


ఇంజెక్షన్ల కొరత:

ఒకపక్క బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నా వైద్య సదుపాయాల కొరతగా ఉండడం మరింత ఆందోళనలు కలిగిస్తోంది. ఈ ఫంగస్ బారిన పడిన వారిని కాపాడాలంటే ‘ఆంపోటెరెసిన్‌ బీ50’ ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఇంజెక్షన్లు చాలా కొరతాగా ఉన్నట్లు సమాచారం. 



ఇదిలా ఉంటే గతంలో బ్లాక్ ఫంగస్ కేసులు ఏడాదికి ఒకటి, రెండు కేసులు బయటపడేవని, కానీ ఇప్పుడు ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు ఓ సీసీనియర్ సర్జన్ పేర్కొన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ సోకుతున్నవారంతా కరోనా నుంచి కోలుకున్నవారేనని, వీరిలో అధికశాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారని ఈఎన్‌టీ నిపుణులు డాక్టర్‌ ఎస్పీ దూబే వెల్లడించారు. ఇండోర్‌లోనూ ఈ కేసులు తరచూ వెలుగుచూస్తున్నాయని తెలిపారు. కరోనా చికత్సలో తీసుకునే స్టెరాయిడ్ల వల్ల బాధితులు కోలుకునే సమయానికి చాలా బలహీరంగా తయారవుతారని, అదే సమయంలో మన చుట్టూ వాతావరణంలో ఉండే ఈ ఫంగస్ శరీరంలోకి వెళ్లి సైనస్, ఊపిరితిత్తులను దెబ్బ తీస్తోందని వెల్లడించారు.

Updated Date - 2021-05-12T01:02:50+05:30 IST