కరోనా ప్లాస్టిక్‌తో సముద్రాలకు ముప్పు...

ABN , First Publish Date - 2020-05-31T19:53:03+05:30 IST

రోనా బారినపడుకుండా ఉండేందుకు మాస్కులు, గ్లోవ్స్‌ల వినియోగం విపరీతంగా పెరగడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం కరోనా కట్టడి కోసం మానవాళి వినియోగిస్తన్న ప్లాస్టిక్ సరంజామాలో దాదాపు 1 శాతం సముద్రాల్లో కలిసే ప్రమాదం ఉందని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ హెచ్చరించింది.

కరోనా ప్లాస్టిక్‌తో సముద్రాలకు ముప్పు...

న్యూఢిల్లీ: కరోనా మమహ్మారి మానవులకు శాపమైనప్పటికీ పర్యావరణానికి ఎంతో మేలు చేసింది. వైరస్‌కు భయపడి ప్రజలంతా ఇళ్లకే పరిమితమవడంతో అనేక దేశాల్లో కాలుష్యం భారీగా తగ్గిపోయింది. వ్యర్థాల విసర్జన తగ్గి నదీ జలాలు శుభ్రపడ్డాయి. భారీ నిధులు, టెక్నాలజీ సాయంతో ప్రభుత్వాలు సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ కూడా పూర్తి చేయలేని దాన్ని కరోనా మహమ్మారి కేవలం రెండు నెలల్లో పూర్తి చేసింది. అయితే ఇది నాణెనికి ఓవైపు మాత్రమే. కరోనా బారినపడుకుండా ఉండేందుకు ప్రజలు మాస్కులు, గ్లోవ్స్‌ల వినియోగం విపరీతంగా పెరగడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం కరోనా కట్టడి కోసం మానవాళి వినియోగిస్తన్న  ప్లాస్టిక్ సరంజామాలో దాదాపు 1 శాతం సముద్రాల్లో కలిసే ప్రమాదం ఉందని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ హెచ్చరించింది. ఒక్కో నెలలో కోటి మాస్కులు సముద్ర జలాల్లో కలుస్తుందని తెలిపింది. ఇది 40 వేల కిలోల  ప్లాస్టిక్‌తో సమానమని ఆందోళన వ్యక్తం చేసింది. కాబట్టి వాడేపారేసిన మాస్కులు, గ్లోవ్స్, వంటి రక్షణ దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. 

Updated Date - 2020-05-31T19:53:03+05:30 IST