క్రమశిక్షణతోనే కరోనా నివారణ

ABN , First Publish Date - 2020-07-09T10:56:26+05:30 IST

కరోనా వైరస్‌ను నుంచి రక్షణ పొందాలంటే జిల్లా ప్రజ లు క్రమశిక్షణతో వ్యవహరిం చాలని కలెక్టర్‌ జె.నివాస్‌ కోరారు. బుధవారం కలెక్టరేట్‌ లో

క్రమశిక్షణతోనే కరోనా నివారణ

కలెక్టరేట్‌, జూలై 8 : కరోనా వైరస్‌ను నుంచి రక్షణ పొందాలంటే జిల్లా ప్రజ లు క్రమశిక్షణతో వ్యవహరిం చాలని కలెక్టర్‌ జె.నివాస్‌ కోరారు. బుధవారం కలెక్టరేట్‌ లో ఆయన విలేఖరుల సమా వేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కరోనా కేసుల పెరు గుదల అధికంగా ఉందన్నారు. ప్రజలు క్రమశిక్షణగా వ్యవహ రిస్తే నివారించవచ్చన్నారు. పరిశుభ్రతోపాటు మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించాలన్నారు.


అనావసరంగా రోడ్లపైకి వచ్చి కరోనా బారిన పడొద్దని హితవు పలికారు. జిల్లాలో చాలా ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా గుర్తించి, ఆయా చోట్ల ప్రజ లందరికీ వైద్య పరీక్షలు చేయిస్తున్నామని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్నవారు ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. జిల్లాలో మరో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలను ఆయా పరిసర వాసులు అందించాలని కోరారు.  


కంటైన్మెంట్‌ జోన్ల పరిశీలన

కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో కిశోర్‌ తెలిపారు. బుధవారం పట్టణంలోని కంటైన్మెంట్‌ జోన్లు పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ పి.అమల, కమిషనర్‌ ఆర్‌.రామలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2020-07-09T10:56:26+05:30 IST