జాగ్రత్తలతోనే కరోనా నివారణ

ABN , First Publish Date - 2021-04-13T05:16:13+05:30 IST

కరోనా రెండో దశ విస్తరిస్తున్న నేపథ్యం లో గ్రామాల్లో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని, కొవిడ్‌ నిబంధనలు పాటించడం ద్వారా కరోనాను నివారించవచ్చని మండల ప్రత్యేకాధికారి కె.రామారావు అన్నారు. లక్ష్మీనర్సుపేట, కరకవ లస, పెద్దకొల్లివలస గ్రామాల్లో సోమవారం మండలస్థాయి అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బం ది, వైద్య సిబ్బంది, వలంటీర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

జాగ్రత్తలతోనే కరోనా నివారణ
ఎల్‌ఎన్‌పేట: మాట్లాడుతున్న మండలం ప్రత్యేకాధికారి రామారావు


ఎల్‌ఎన్‌పేట మండల ప్రత్యేకాధికారి రామారావు

ఎల్‌.ఎన్‌.పేట, ఏప్రిల్‌ 12: కరోనా రెండో దశ విస్తరిస్తున్న నేపథ్యం లో గ్రామాల్లో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని, కొవిడ్‌ నిబంధనలు పాటించడం ద్వారా కరోనాను నివారించవచ్చని మండల ప్రత్యేకాధికారి కె.రామారావు అన్నారు. లక్ష్మీనర్సుపేట, కరకవ లస, పెద్దకొల్లివలస గ్రామాల్లో సోమవారం మండలస్థాయి అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బం ది, వైద్య సిబ్బంది, వలంటీర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మాస్క్‌ను ధరించాలని, శానిటైజర్‌ను ఉపయోగించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు.  మూకు మ్మడిగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదన్నారు. ప్రతిరోజూ వలంటీర్లు వారికి కేటాయించిన 50 కుటుంబాలను పరిశీలించి జ్వరాలు, జలుబు, దగ్గు వంటి లక్షణాలుంటే తక్షణం సచివాలయ రిజిస్టర్‌లో నమోదు చేసి వారికి వైద్య సేవలందించేలా కృషి చేయాలన్నారు. ఒకవేళ జ్వరతీవ్రత ఎక్కు వగా ఉండి మూడు రోజుల్లో తగ్గకుంటే హోం క్వారంటైన్‌ లేకుంటే ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రానికి తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫీవర్‌ సర్వే పక్కాగా చేపట్టడంలో వలంటీర్లు, ఆశ, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బీఎస్‌ఎస్‌ సత్యనారాయణ, ఎంపీడీవో ఆర్‌.కాళీప్రసాదరావు, ఈవోపీఆర్డీ వసంతకుమారి, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


అప్రమత్తం చేయండి

జలుమూరు: కరోనా రెండోదశ శరవేగంగా వ్యాపిస్తున్నందున దీని కట్టడికి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను అప్రమత్తం చేయాలని  తహసీల్దార్‌ జామి ఈశ్వరమ్మ సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు, వీఆర్వోలు, వైద్య సిబ్బందితో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అత్యవసర పనులుం టే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని ప్రజానీకానికి సూచించాలన్నారు. ఉగాది వేడుకలు ఎవరి ఇళ్లల్లో వారే చేసుకోవాలన్నారు. మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్‌ ఉపయోగించడం, సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం తప్పనిసరని సూచించారు.  సమావేశంలో ఎంపీడీవో ఎ.దామోదరరావు పాల్గొన్నారు.


దుకాణాల్లో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి

టెక్కలి (కోటబొమ్మాళి):  రోజురోజు పెరుగుతున్న కరోనా దృష్ట్యా దుకాణాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించడం తప్పనిసరని, లేకుంటే చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో బడే రాజేశ్వరరావు, తహసీల్దార్‌ ఆర్‌.మధు హెచ్చరించారు. సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాల యంలో మండలంలోని వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. వర్తక సంఘాలు, వ్యాపా రులు, దుకాణాల్లో పనిచేసే సిబ్బంది మాస్క్‌ పెట్టుకోవడం తప్పనిసరన్నారు. దుకాణాల వద్ద కొనుగోలుదారుల కోసం శానిటైజర్‌ ఉంచాలన్నారు. అలాగే షాపునకు వచ్చే వారు భౌతిక దూరం పాటించేలా కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని షాపుల్లో పనిచేసే సిబ్బందికి తప్పని సరిగా మాస్క్‌లు ధరించాలని, షాపుల్లో శానిటైజర్‌ చేయించాలని, దుకాణాలకు వచ్చేవారు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 


 జ్వర పీడితులను గుర్తించండి 

 మెళియాపుట్టి: కరోనా రెండో దశ నేపథ్యంలో గ్రామాల్లో సర్వే చేపట్టి జ్వర పీడితులను గుర్తించి వైద్య సేవలు అందించాలని డీటీ బి.ప్రసాదరావు కోరారు. సోమవారం వలంటీర్లు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. ప్రతి రోజు కేటాయించిన 50 ఇళ్లను సందర్శించి జ్వరాలుంటే తగు చర్యలు తీసుకునేలా అవగాహన కలిగించాలన్నారు. 14 రోజుల పాటు కొవిడ్‌ టీకాపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రంలో ఏవో అనూరాధ, ఈవోపీఆర్డీ రమేష్‌, వైద్యాధికారులు జి.గణపతిరావు, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


 కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోండి 

మందస: కరోనా వైరస్‌ ప్రబలకుండా ప్రతిఒక్కరూ  చర్యలు తీసుకో వాలని  తహసీల్దార్‌ బి.పాపా రావు సూచించారు. సోమవారం మందసలో  పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.  సమావేశంలో ఎంపీడీవో తిరుమలరావు, ఈవోపీఆర్డీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-04-13T05:16:13+05:30 IST