వ్యాపార కూడళ్లలో కరోనా నివారణ చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-05-08T05:04:04+05:30 IST

రామగుండం కార్పొరేషన్‌లో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తించకుండా చర్యలు చే పట్టాలని కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ సూచించా రు.

వ్యాపార కూడళ్లలో కరోనా నివారణ చర్యలు చేపట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌

- కార్పొరేటర్లు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులతో కమిషనర్‌ సమావేశం

కోల్‌సిటీ, మే 7: రామగుండం కార్పొరేషన్‌లో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తించకుండా చర్యలు చే పట్టాలని కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ సూచించా రు. ప్రధాన వాణిజ్యకేంద్రాలైన లక్ష్మీనగర్‌, కళ్యాణ్‌ నగర్‌ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్లు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులతో శుక్రవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో కమిషనర్‌ ఉ దయ్‌కుమార్‌ చర్చించారు. భౌతిక దూరం పాటించేలా దుకాణాల వద్ద చర్యలు చేపట్టడం, అవసరమైతే దుకాణాలు తెరిచిఉంచే వేళలు, పని దినా లు తగ్గించడం వంటి అంశాలపై చర్చించారు. కొ విడ్‌ వ్యాప్తి నిరోధించడంలో కార్పొరేషన్‌కు తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తామని వారు హామీఇచ్చారు. ఇతర అన్ని వ్యాపారసంస్థల యా జమాన్యాలతో చర్చించి కొవిడ్‌ వ్యాప్తినివారణ కు సమష్టిగా నిర్ణయం తీసుకుని స్వచ్ఛందంగా అమలుచేస్తామని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు హామీ ఇచ్చారు. సమావేశంలో కార్పొరేటర్‌ బాల రాజ్‌కుమార్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధి అ శోక్‌రావు, నాయకులు పొన్నం లక్ష్మణ్‌, దుబాసి మల్లేష్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కిశోర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-08T05:04:04+05:30 IST