కరోనా నివారణ మందు ఉచితంగా ఇస్తాం

ABN , First Publish Date - 2021-06-24T05:47:40+05:30 IST

కరోనా మందు ఉచితంగా అందించేందుకు సంసిద్ధంగా ఉన్నానని కృష్ణపట్నం ఆనందయ్య తెలిపారు.

కరోనా నివారణ మందు ఉచితంగా ఇస్తాం

 మిర్యాలగూడలో కృష్ణపట్నం ఆనందయ్య

 ఘనస్వాగతం పలికిన బీఎల్‌ఆర్‌ బ్రదర్స్‌

మిర్యాలగూడ టౌన్‌, జూన్‌ 23:  కరోనా మందు ఉచితంగా అందించేందుకు సంసిద్ధంగా ఉన్నానని కృష్ణపట్నం ఆనందయ్య తెలిపారు. బీఎల్‌ఆర్‌ బ్రదర్స్‌ సంస్థ ఆఽధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం చేపట్టిన కరోనా మందు పంపిణీ కార్యక్రమానికి ఆనందయ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా నిర్వాహకులు, వేద పండితులు మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆనందయ్య మాట్లాడుతూ తలి ్లదండ్రులు, గురువుల ఆశిస్సులతో ఆయుర్వేద మందును తయారు చేస్తున్నానన్నారు. మందు తీసుకోవడంలో ప్రజలెవరూ భయప డాల్సిన పనిలేదన్నారు. ఈ ప్రాంత కరోనా బాధితులకు ఆనందయ్య మందు అందించేందుకు బీఎల్‌ఆర్‌ బ్రదర్స్‌ ముందకు రావడం ఆనందమన్నారు. మందు తయారీలో పలు ఆటంకాలు ఎదురైన నేపఽథ్యంలో జాప్యం జరిగిందని, బీఎల్‌ఆర్‌ బ్రదర్స్‌ కోరిన మందును త్వరలోనే తయారు చేసి పంపుతానన్నారు. అనంతరం మందును పంపిణీ చేశారు. సంస్థ వ్యవస్థాపకుడు, మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బీఎల్‌ఆర్‌ మాట్లాడుతూ నాలుగైదు రోజుల్లో నియోజకవర్గ పరిధిలోని ప్రతీ కుటుంబానికి ఆనందయ్య మందు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్‌ కేతావత్‌ శంకర్‌నాయక్‌, వస్‌టౌన్‌ సీఐ, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, దీపక్‌రెడ్డి పాల్గొ న్నారు. అనంతరం ఆనందయ్యను యాదవసంఘ నాయకులు ఘనంగా సన్మానించారు.  

ఆయుర్వేదిక్‌ మందుతో రోగ నిరోధక శక్తి 

రామగిరి : కరోణాను ఎదుర్కోకునేందుకు కృష్ణపట్నం ఆనం దయ్య తయారుచేసిన ఆయుర్వేదిక్‌ మందు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌ గౌడ్‌, మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బండారు ప్రసాద్‌ అన్నారు. కృష్ణ పట్నం ఆనందయ్య తయారుచేసిన ఆయుర్వేదిక్‌ మందును బుధ వారం పట్టణంలో వివేకనందనగర్‌కాలనీలో డిఎస్ప్‌ వెంకటేశ్వ ర్‌రెడ్డి చేతుల మీదుగా వారు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోరిశెట్టి నాగేశ్వర్‌రావు, నాయకులు కంకణాల నాగిరెడ్డి, బొజ్జ నాగరాజు, రావిరాల వెంకటేశ్వర్లు, దాయం భుపాల్‌రెడ్డి, చర్లపల్లి గణేశ్‌, రవెళ్ల కాషమ్య, టు టౌన్‌ ఎస్‌ఐ నర్సింహులు ఉన్నారు. 

Updated Date - 2021-06-24T05:47:40+05:30 IST