ఐదు కుటుంబాల వారికి పచ్చడి పెట్టిన తర్వాత ఆమెకు కరోనా అని తేలడంతో..

ABN , First Publish Date - 2020-05-23T16:29:07+05:30 IST

బిక్కవోలు శివారు దేవుడిమాన్యంలో నివసిస్తున్న ఇద్దరికి కోవిడ్‌ పాజిటివ్‌గా వైద్యులు ధ్రువీకరించడంతో బిక్కవోలు గ్రామం ఉలిక్కిపడింది. బుధవారం రాత్రి పెదపూడి మండలం జి.మామిడాడకు చెందిన వ్యక్తి కోవిడ్‌తో మృతి చెందిన వ్యక్తి ఈనెల

ఐదు కుటుంబాల వారికి పచ్చడి పెట్టిన తర్వాత ఆమెకు కరోనా అని తేలడంతో..

ఉలిక్కిపడ్డ ‘బిక్కవోలు’.. ఐదు కుటుంబాల వారికి పచ్చడి పట్టిన కొవిడ్‌ బాధితురాలు

బిక్కవోలు(తూర్పు గోదావరి జిల్లా): బిక్కవోలు శివారు దేవుడిమాన్యంలో నివసిస్తున్న ఇద్దరికి కోవిడ్‌ పాజిటివ్‌గా వైద్యులు ధ్రువీకరించడంతో బిక్కవోలు గ్రామం ఉలిక్కిపడింది. బుధవారం రాత్రి పెదపూడి మండలం జి.మామిడాడకు చెందిన వ్యక్తి కోవిడ్‌తో మృతి చెందిన వ్యక్తి ఈనెల 15న దేవుడిమాన్యంలోని తన మేనకోడలు ఇంటికి వచ్చాడు. దీంతో బిక్కవోలులో అతనిని కలసిన 20 మందికి గురువారం కోవిడ్‌ పరీక్షలు చేయగా శుక్రవారం ఇతని మేనకోడలు (50), మేనకోడలు మనుమడు (17)కు నిర్ధారణ అయ్యింది. మిగిలిన వారిని గ్రామంలోని ఉన్నతపాఠశాలలో క్వారంటైన్‌లో ఉంచారు. అలాగే కొవిడ్‌ వచ్చిన ఆమె భర్త, కూతురు, మనుమరాలితోపాటు, వీరిని కలసిన మరో 60 మందికి బిక్కవోలు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ రాజీవ్‌ శ్వాబ్‌ నమూనాలు సేకరించి జీజీహెచ్‌కు పంపారు. ఫలితాలు శనివారం వస్తాయి. కోవిడ్‌ బారినపడిన మహిళ.. తన పక్కనున్న ఐదు కుటుంబాల వారికి ఈ నెల 18న పచ్చళ్లు తయారుచేసింది. దీంతో వారికి, దేవుడిమాన్యంలో మిగిలిన వారికి శనివారం పరీక్షలు జరుపుతారు. కొవిడ్‌ సోకిన వారి ఇంటి నుంచి 200 మీటర్ల వరకూ కంటైన్మెంట్‌ జోన్‌ను ఏర్పాటు చేశా మని దేవుడిమాన్యాన్ని సందర్శించిన రామచంద్రపురం ఆర్‌డీఓ గణేష్‌కుమార్‌, డీఎస్‌పీ రాజగోపాలరెడ్డి తెలిపారు. అలాగే 500 మీటర్ల వరకూ బఫర్‌జోన్‌గా ప్రకటించారు. వీరి వెంట అనపర్తి సీఐ భాస్కరరావు, తహశీల్దార్‌ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ అనుపమ ఉన్నారు.

Updated Date - 2020-05-23T16:29:07+05:30 IST