విద్యార్థినికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-02-27T05:39:36+05:30 IST

మండలంలోని చిన్నకంబలూరు ప్రాథమిక పాఠశాలలో ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యుడు రెడ్డికిషోర్‌ తెలిపారు.

విద్యార్థినికి కరోనా పాజిటివ్‌

రుద్రవరం, ఫిబ్రవరి 26: మండలంలోని చిన్నకంబలూరు ప్రాథమిక పాఠశాలలో ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యుడు రెడ్డికిషోర్‌ తెలిపారు. ఈనెల 23వ తేదీన గ్రామంలో 62 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో విద్యార్థినికి పాజిటివ్‌ వచ్చింది. విద్యార్థినితో కాంటాక్టులో ఉన్న 24 మందికి పరీక్షలు చేయించామని డాక్టర్‌ రెడ్డికిషోర్‌ తెలిపారు. విద్యార్థినిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించామన్నారు. విద్యార్థినికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్లినట్లు ఇన్‌చార్జి ఎంఈవో మహబూబ్‌బాషా తెలిపారు. 


2,276 మందికి వ్యాక్సిన్‌

 కర్నూలు(హాస్పిటల్‌), ఫిబ్రవరి 26: జిల్లాలో 67 ఆరోగ్య కేంద్రాల్లో 6,620 మందికి  గానూ 2,276 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డా.కె.వెంకటరమణ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు సంభవించలేదన్నారు. 


మరో ముగ్గురికి కరోనా..

గత 24 గంటల్లో జిల్లాలో మరో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 60,873కు చేరింది. 24 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 60,390 మంది డిశ్చార్జి అయ్యారు. 

Updated Date - 2021-02-27T05:39:36+05:30 IST