పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా పాజిటీవ్ వ్యక్తి డిశ్చార్జ్

ABN , First Publish Date - 2020-06-05T21:56:49+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లాలో అధికారుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది.

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా పాజిటీవ్ వ్యక్తి డిశ్చార్జ్

పశ్చిమగోదావరి జిల్లాలో అధికారుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం 20 రోజులుగా కొంతమంది యువకులను క్వారంటైన్‌లో ఉంచారు. గత నెల 16న కొంతమంది యువకులు జిల్లాకు వచ్చారు. దీంతో వారిని భీమవరం క్వారంటైన్‌కు తరలించారు. ఆ మరుసటి రోజు చెన్నై నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటీవ్ అని తేలింది. అయితే అతనికి వ్యాధి నిర్ధారణ కాకుండానే ఐదు రోజుల్లోనే అతనిని, అతనిపాటు వచ్చినవారిని డిశ్చార్జ్ చేశారు. తర్వాత తప్పు జరిగిందని తెలుసుకుని పాజిటీవ్ వచ్చిన వ్యక్తిని అతని ఇంటి నుంచి ఆస్పత్రికి తరలించారు. 


మరో పాజిటీవ్ వ్యక్తితో డిశ్చార్జ్ అయినవారిలో కొందరి ఆచూకి తెలియడంలేదు. దాంతో ఉన్నతాధికారుల నుంచి ఎక్కడ ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందోనని ఆ తప్పు కప్పిపుచ్చుకోడానికి ఢిల్లీ నుంచి వచ్చిన యువకులను క్వారంటైన్‌లో ఉంచారు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న యువకులే సెకండరీ కాంట్రాక్ట్ వారిగా చెబుతూ ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తున్నారు.

Updated Date - 2020-06-05T21:56:49+05:30 IST