Abn logo
Sep 23 2021 @ 19:23PM

ఉపాధ్యాయురాలికి, ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నెమిల ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. మండలంలోని నెమిల ఉన్నత పాఠశాలలో 70మంది విద్యార్థులు, 10 మంది ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు. వీరిలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయురాలు ప్రతిరోజూ హైదరాబాద్‌ నుంచి వచ్చి వెళుతుంటారు. జలుబుతో బాధపడుతున్న ఆమె బుధవారం హైదరాబాద్‌లో కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో వైద్యసిబ్బంది గురువారం పాఠశాలలో ప్రత్యేక శిబిరం ఏర్పాటుచేసి విద్యార్థులు, సిబ్బందికి నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా ఫలితం రావడంతో వారికి మెడికల్‌ కిట్‌ అందజేసి హోంఐసొలేషన్‌లో ఉండాల్సిందిగా సూచించారు. పాఠశాలను హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేయించారు. 

ఇవి కూడా చదవండిImage Caption