లారీ డ్రైవర్‌కు కరోనా.. 33 మంది క్వారంటైన్‌కు..

ABN , First Publish Date - 2020-05-16T18:58:44+05:30 IST

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబేడు మార్కెట్‌ రాయచోటి నియోజకవర్గ ప్రజలను ఉలికిపడేలా చేసింది. సంబేపల్లె మండలం ప్రకాష్‌ నగర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

లారీ డ్రైవర్‌కు కరోనా.. 33 మంది క్వారంటైన్‌కు..

రాయచోటి /సంబేపల్లె (కడప): తమిళనాడు రాష్ట్రంలోని కోయంబేడు మార్కెట్‌ రాయచోటి  నియోజకవర్గ ప్రజలను ఉలికిపడేలా చేసింది. సంబేపల్లె మండలం ప్రకాష్‌ నగర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను రెండు వారాల కిందట తమిళనాడు రాష్ట్రం కోయంబేడు మార్కెట్‌కు పండ్లలోడుతో బాడుగకు వెళ్లి వచ్చాడు. ఈ నేపధ్యంలో నాలుగు రోజుల కిందట పోలీసులు అతడిని హౌస్‌క్వారెంటైన్‌లో ఉండమని చెప్పి కరోనా పరీక్షలు నిర్వహించారు. గురువారం రాత్రి అతనికి కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు తెలిసింది. దీంతో ఒక్కసారిగా రాయచోటి ప్రాంతం ఉలిక్కిపడింది. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కోయంబేడుకు వెళ్లివచ్చిన తర్వాత పల్లెలో విందులో పాల్గొన్నాడని సమాచారం. ఈ విందుకు సంబేపల్లె మండలం, రాయచోటి, చిన్నమండెం, చిత్తూరు జిల్లా కలకడ మండలంలోని అతని బంధువులు హాజరైన ట్లు తెలుస్తోంది. 


ఈ పల్లెకు చెందిన సుమారు 10 మంది పారిశుధ్య కార్మికులు రాయచోటి మునిసిపాలిటీలో, 5 మంది రాయచోటి ప్రభుత్వాసుపత్రిలో పారిశుధ్య విభాగం లో పనిచేస్తున్నారు. 170 కుటుంబాలు కలిగిన ఆ ఊరి లో ఇతరులకు వ్యాధి సోకకుండా పోలీసులు, అధికారులు వీ ధుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పాజిటీవ్‌ వచ్చిన వ్యక్తి తో సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్లందరి వివరాల ను స్పెషల్‌ డీఎస్పీ ప్రసాద్‌రావు, ఎస్‌ఐ రాజారమే్‌ష సేకరించారు. అందులో 33 మందిని కరోనా అనుమానితులుగా భావిస్తూ క్వారెంటైన్‌కు తరలించారు. మిగిలిన వారికి శనివారం వైద్య సిబ్బందితో గ్రామంలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఎస్పీ అన్బురాజన్‌, ఆర్డీవో మలోలా, గాలేరు- నగరి సుజల స్రవంతి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సుజన, రాయచోటి రూరల్‌ సీఐ లింగప్పలు ప్రకా్‌షనగర్‌ కాలనీని సందర్శించారు. తీసుకోవాల్సిన పారిశుధ్య చర్యలపై ఎంపీడీవో నరసింహులు, తహసీల్దార్‌ నరసింహులు, వైద్యాధికారులు సూర్యనారాయణరెడ్డితో మాట్లాడారు.

Updated Date - 2020-05-16T18:58:44+05:30 IST