కొత్తగా 78 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-09-29T06:08:15+05:30 IST

జిల్లాలో కొత్తగా మరో 78 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ

కొత్తగా 78 మందికి కరోనా పాజిటివ్‌

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురి మృతి 


కరీంనగర్‌, సెప్టెంబర్‌ 28 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): జిల్లాలో కొత్తగా మరో 78 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదలచేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో కరోనా బారిన పడి ముగ్గురు సోమవారం మృతిచెందగా, జిల్లావ్యాప్తంగా దాదాపు 220 మంది వరకు కరోనా వ్యాధి సోకింది. చొప్పదండి మండలంలోని ఆర్నకొండ గ్రామానికి చెందిన 56 సంవత్సరాల మహిళతోపాటు, గంగాధర క్రాస్‌ రోడ్‌కు చెందిన వ 65 సంవ త్సరాల మహిళ, సైదాపూర్‌ మండలం రాయికల్‌ గ్రామానికి చెందిన 70 సంవత్సరాల వృద్ధుడికి కరోనా సోకడంతో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందారు.  స్థానికుల సమా చారం మేరకు సోమవారం తిమ్మాపూర్‌ మండలంలో 19 మందికి, జమ్మి కుంట మండలంలో 18 మందికి, హుజురాబాద్‌ మండలంలో 17మందికి, మానకొండూర్‌ మండలంలో 16 మందికి కరోనా వ్యాధి సోకింది.


అలాగే గంగాధర మండలంలో 11, చొప్పదండి మండలంలో 9, ఇల్లందకుంట 9, రామడుగు మండలంలో 9, చిగురుమామిడి మండలంలో 8, వీణవంక మం డలంలో 5, కరీంనగర్‌ రూరల్‌ మండలంలో 3, కొత్తపల్లిలో 3, శంకర పట్నంలో 3, సైదాపూర్‌లో 2 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌ పట్టణంలోని తీగలగుట్టపల్లిలో ఒకరికి, తిరుమల్‌నగర్‌లో ఇద్దరికి, కట్టరాం పూర్‌లో ఎనిమిది మందికి, భగత్‌నగర్‌లో ఇద్దరికి వ్యాధి నిర్ధారణ అయింది.  వావిలాలపల్లిలో ముగ్గురు, అంబేద్కర్‌నగర్‌లో ఇద్దరు, ఆదర్శనగర్‌లో ఒకరు, శివాజీనగర్‌లో ఒకరు, విద్యానగర్‌లో ఇద్దరు, లక్ష్మీనగర్‌లో ముగ్గురు, కాపువా డలో ఇద్దరు, అశోక్‌నగర్‌లో ఇద్దరు, కోతిరాంపూర్‌లో ఇద్దరు, హౌసింగ్‌ బోర్డుకాలనీలో ఇద్దరు, మారుతీనగర్‌లో ముగ్గురు వ్యాధిబారిన పడ్డారు.  

Updated Date - 2020-09-29T06:08:15+05:30 IST