జిల్లాలో 422 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-04-17T05:50:10+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. శుక్ర వారం జిల్లావ్యాప్తంగా 422 మంది కరోనా వ్యాధి బారిన పడ్డారు.

జిల్లాలో 422 మందికి కరోనా పాజిటివ్‌

సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 16: జిల్లాలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. శుక్ర వారం జిల్లావ్యాప్తంగా  422 మంది కరోనా వ్యాధి బారిన పడ్డారు. వీరిలో కరీం నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన 194 మంది కాగా, వివిధ మండలాల్లో 228 మంది వ్యాధి బారినపడ్డారు. సైదాపూర్‌ మండలంలో ముగ్గురు, ఇల్లందకుంట మండ లంలో 17 మంది, చిగురుమామిడిలో 20 మంది, గంగాధరలో 40 మంది, మాన కొండూర్‌లో ఐదుగురు, హుజురాబాద్‌లో 33 మంది, తిమ్మాపూర్‌లో 17 మంది, రామడుగులో 50 మంది, చొప్పదండిలో 23 మంది, వీణవంకలో 11 మంది, జమ్మికుంటలో ఒకరికి కరోనా వ్యాధి సోకింది. 


5,152 మందికి వ్యాక్సిన్‌


జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 34 వ్యాక్సినేషన్‌ సెంటర్లలో 5,152మందికి వ్యాక్సి న్‌ ఇచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుజాత తెలిపారు. కొవిన్‌ 2.0 యాప్‌ ద్వారా 5,152 మంది పేర్లు నమోదు చేసుకోగా అందరూ టీకా తీసు కున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం సూచించిన వారందరు తప్పనిసరిగా తమకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్‌ సురక్షితమైందని, ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్నవారు కూడా సాధారణ ప్రజలవలే మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలన్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని, దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు లక్షణాలు ఉన్న వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తమ సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లో  పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 


రామడుగు మండలంలో 50 కరోనా కేసులు

గోపాల్‌రావుపేటలో అత్యధికంగా 21 కేసులు


రామడుగు: రామడుగు మండలంలో కరోనా కేసులు రోజురోజుకు పెరు గుతున్నాయి. మండలంలోని రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో నిర్వహించిన ప్రత్యేక శిబిరాల్లో 401 మందికి పరీక్షలు నిర్వహించగా 50 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  ఒక్క గోపాల్‌రావుపేటలోనే 21 మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ సందర్భంగా 338 మంది కరోనా నివారణ వ్యాక్సిన్‌ను వేశారు.

Updated Date - 2021-04-17T05:50:10+05:30 IST