348 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-04-16T07:02:14+05:30 IST

కరోనా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కల్లోలం రేపుతోంది. దూసుకుపోతున్న సెకండ్‌ వేవ్‌ లో తాజాగా ఒకరు మృతి చెందగా, గురువారం ఒక్కరోజే 348 మంది పాజిటివ్‌ బారిన పడ్డారు.

348 మందికి కరోనా పాజిటివ్‌

-  కొవిడ్‌తో మరొకరు మృతి

 - సిరిసిల్ల ఆసుపత్రిలో బాధితుల అవస్థలు 

- 50 పడకలతో రోగుల ఇక్కట్లు

- డిశ్చార్జి అయితేనే మరొకరికి అవకాశం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కరోనా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కల్లోలం రేపుతోంది. దూసుకుపోతున్న సెకండ్‌ వేవ్‌ లో తాజాగా ఒకరు మృతి చెందగా, గురువారం ఒక్కరోజే 348 మంది పాజిటివ్‌ బారిన పడ్డారు. మరోవైపు జిల్లా అసుపత్రిలో  కరోనా బారిన పడిన వారికి చికిత్స అందక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం 50 పడకలు మాత్రమే కరోనా బారిన పడినవారికి ఉపయోగి స్తున్నారు. ఒకరు డిశ్చార్జి అయితేనే మరొకరికి అవకాశం అన్నట్లుగా మారింది. గత సంవత్సరం జిల్లా ఆసుపత్రిలో కొవిడ్‌ పేషేంట్ల కోసం 50 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.  అదే సమయంలో కొవిడ్‌ కేసులు తగ్గిపోవడంతో కొవిడ్‌ వార్డును జనరల్‌ రోగుల కోసం ఉపయోగిస్తు న్నారు. ప్రస్తుతం కొవిడ్‌ రోగులు పెరిగిపోయినా వార్డు అందు బాటులోకి రాలేదు. ప్రస్తుతం జిల్లా లో 2,364 మంది కొవిడ్‌ బారినపడి చికిత్సపొం దుతున్నారు. గడిచిన 15 రోజుల్లోనే 2,036 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో చాలా మంది హైదరాబాద్‌ కార్పొ రేట్‌ ఆసుపత్రిలో చేరగా మిగతా వారు ప్రభుత్వ వైద్యంపైనే అధారపడ్డారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా ఆసుపత్రికి వస్తే మంచాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిని ప్రసూతి విభాగం మినహాయించి పూర్తిగా కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చే విధంగా చర్యలు చేపట్టారు. అసుపత్రిలో లిక్విడ్‌ అక్సిజన్‌ ట్యాంక్‌ ఉండ గా అదనంగా అక్సిజన్‌ అందించే విధంగా మిషన రీలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో కరోనా వేగంగా విస్తరిస్తున్నా ప్రజలు నిర్లక్ష్యం మాత్రం వీడడం లేదు. మాస్క్‌లు ధరించకపోవడం, భౌతికదూరం, శానిటైజేషన్‌ వంటివి పాటించడం లేదు. అత్యవసంర కాకపోయినా ప్రయాణాలు సాగిస్తున్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లివచ్చిన యాత్రికులు కరోనాను వెంట తెచ్చుకుంటున్నారు. 

- యాత్రికుల్లో ఇద్దరు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాజాగా గురువారం 1,751 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు చేయగా 348మందికి పాజిటివ్‌ వచ్చింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తంగళ్లపల్లిలో 14 మంది, నేరేళ్లలో 26 మంది, చీర్లవంచలో 8 మంది, కోనరావుపేటలో 20 మంది, ఇల్లంతకుంటలో 23 మంది, గంభీరావుపే టలో 29 మంది, పోత్గల్‌లో 7 మంది, ఎల్లారెడ్డిపేటలో 43 మంది, వేములవాడలో 73 మంది, చందుర్తిలో 12 మంది, బోయినపల్లిలో 27, విలాసాగర్‌లో 5, కొదురుపాకలో 3, సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో 5 మంది, అంబేద్కర్‌ నగర్‌ అర్భన్‌హెల్త్‌ సెంటర్‌ 35, సుందరయ్యనగర్‌లో హెల్త్‌ సెంటర్‌లో 18 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఎల్లారెడ్డిపేట నుంచి ఇటీవల 100 మంది యాత్రలకు వెళ్లి వచ్చిన వారిలో 40 మంది వరకు కరోనా బారిన పడ్డారు. గురువారం 55 ఏండ్ల వ్యాపారి హైదరాబాద్‌ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందతూ మృతిచెందారు. జిల్లాలో ఇప్పటివరకు 14,665 మంది కొవిడ్‌ బారిన పడగా, 12,149 మంది కోలుకున్నారు. 152 మంది మృతిచెందారు. ప్రస్తుతం జిల్లాలో  2,364 మంది చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-04-16T07:02:14+05:30 IST