జిల్లాలో 20 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-08-04T11:21:44+05:30 IST

సిద్దిపేట జిల్లాలో సోమవారం 20 కరోనా కేసులు నమోదయ్యాయి.

జిల్లాలో 20 మందికి కరోనా పాజిటివ్‌

సిద్దిపేట, ఆగస్టు 3 : సిద్దిపేట జిల్లాలో సోమవారం 20 కరోనా కేసులు నమోదయ్యాయి. సిద్దిపేటలో ఆరుగురికి, చేర్యాలలో నలుగురికి, గజ్వేల్‌లో ఇద్దరికి, కొండపాకలో ఇద్దరికి, జగదేవ్‌పూర్‌, కోహెడ, కొమురవెల్లి, మర్కుక్‌, ములుగు, వర్గల్‌ పీహెచ్‌సీల పరిధిలో ఒక్కొక్కరికి వైరస్‌ సోకినట్లు అధికారిక సమాచారం.


కుకునూరుపల్లిలో నలుగురికి

కొండపాక : కొండపాక మండలం కుకునూరుపల్లి పీహెచ్‌సీలో సోమవారం 10 మందికి నిర్వహించిన కరోనా టెస్టుల్లో నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి తెలిపారు. మండలంలోని కోనాయిపల్లికి చెందిన ఇద్దరికి, సిద్దిపేట నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందన్నారు. 


చేర్యాలలో నలుగురికి, కొమురవెల్లిలో ఇద్దరికి

చేర్యాల: చేర్యాల ప్రభుత్వాస్పత్రిలో సోమవారం నిర్వహించిన రాపిడ్‌ టెస్టులో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. మున్సిపల్‌ పరిధిలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లో కూరగాయలు అమ్మే వ్యాపారి కుటుంబంలో ముగ్గురు, కొమురవెల్లి మండలంలోని పీహెచ్‌సీలో నిర్వహించిన పరీక్షా ఫలితాల్లో ఓ కానిస్టేబుల్‌కు, పంచాయతీ కార్యదర్శికి కరోనా వచ్చింది. 


కరోనాతో వృద్ధుడి మృతి 

రాయపోల్ : రాయపోల్‌ మండలం మంతూర్‌కు చెందిన వృద్ధుడు (90) కరోనాతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. అలాగే రాంసాగర్‌ గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


కోహెడలో పెరుగుతున్న కరోనా కేసులు 

కోహెడ : కోహెడలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే మండల కేంద్రంలో ఇద్దరికి, రెండురోజుల క్రితం చెంచల్‌ చెరువుపల్లిలో యువకుడికి సోకింది. 

Updated Date - 2020-08-04T11:21:44+05:30 IST