Abn logo
Jul 13 2020 @ 10:52AM

బాలాజీ టెలీఫిలిమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రె‌సిడెంట్‌కు క‌రోనా పాజిటివ్‌!

కరోనా వైరస్ బాలీవుడ్ పరిశ్రమను చుట్టుముట్టింది. బాలీవుడ్ దిగ్గ‌జం అమితాబ్ బచ్చన్ కరోనా బారిన ప‌డిన విష‌యం విదిత‌మే. అలాగే నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబం కూడా ఈ వైరస్ బారిన పడింది. తాజాగా బాలాజీ టెలిఫిలిమ్స్‌ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తనుశ్రీ దాస్‌గుప్తా కూడా కరోనా బారిన‌ప‌డిన‌ట్లు తేలింది. దీంతో ఆమె ముందుగా హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. త‌రువాత ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతున్నారు. కాగా త‌నుశ్రీ తల్లిలో కూడా తేలికపాటి క‌రోనా లక్షణాలు ఉండ‌టంతో ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా తనుశ్రీ మాట్లాడుతూ...త‌న‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకావ‌డంతో, వైద్యుల స‌ల‌హా మేర‌కు ఆసుప‌త్రిలో చేరాన‌ని తెలిపారు. త‌న‌ తల్లికి తేలికపాటి క‌రోనా లక్షణాలు ఉన్నాయ‌న్నారు. త్వ‌ర‌లోనే ఈ వైర‌స్ నుంచి కోలుకుంటాన‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

Advertisement
Advertisement
Advertisement