సీఎఫ్ఎంఎస్‌లో ఉన్నతాధికారికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-05-31T08:36:16+05:30 IST

బ్రహీంపట్నంలో ఉన్న సీఎఫ్‌ఎంఎస్‌ కార్యాలయంలో ఓ ఉన్నతాధికారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వచ్చేవారం వరకు ఆ భవనాన్ని మూసివేశారు. సీఎఫ్‌ఎంఎస్‌ కార్యాలయంతో పాటు పీఏవో, ట్రెజరీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా వచ్చే

సీఎఫ్ఎంఎస్‌లో ఉన్నతాధికారికి పాజిటివ్‌

  • కార్యాలయం మూసివేత

ఇబ్రహీంపట్నంలో ఉన్న సీఎఫ్‌ఎంఎస్‌ కార్యాలయంలో ఓ ఉన్నతాధికారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వచ్చేవారం వరకు ఆ భవనాన్ని మూసివేశారు. సీఎఫ్‌ఎంఎస్‌ కార్యాలయంతో పాటు పీఏవో, ట్రెజరీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా వచ్చే వారం మొత్తం వర్క్‌ ఫ్రం హోం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ భవనంలో మొత్తం 150మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో రోజూ 60మందికి పైగా విధులకు హాజరవుతున్నారు. ఉన్నతాధికారికి పాజిటివ్‌ రావడంతో వీరందరి నమూనాలు పరీక్షలకు పంపారు. కాగా, కరోనా సోకిన ఉన్నతాధికారికి ప్రత్యేక చాంబర్‌ లేదు. పదిమంది ఉద్యోగులు కలిసి ఒకే టేబుల్‌పై పనిచేస్తారు. గత 8రోజుల నుంచి ఆయన కార్యాలయానికి వస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. సచివాలయంలోని ఆర్థికశాఖ కార్యదర్శులు, అధికారులు తరచూ ఈ కార్యాలయంలో సమావేశాలు నిర్వహించుకుంటారు. ఈ నేపథ్యం లో ఆర్థికశాఖ ఉద్యోగులు సైతం భయాందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-05-31T08:36:16+05:30 IST