పశ్చిమలో 14కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-04-02T11:38:18+05:30 IST

Corona positive cases reaching 14 in the West

పశ్చిమలో 14కు చేరిన కరోనా  పాజిటివ్‌ కేసులు

ఇదే జాబితాలో ఇంకొందరు.. అధికారుల అప్రమత్తం 

జిల్లావ్యాప్తంగా పదుల సంఖ్యలో క్వారంటైన్‌లకు..

అనుమానితుల కోసం అన్నిచోట్ల జల్లెడ

భీమవరం, ఏలూరుల్లో రెడ్‌ జోన్‌ ఏర్పాటు 



పాజిటివ్‌ కేసులు :  ఏలూరు  7, భీమవరం 2, పెనుగొండ 2, 

                               గుండుగొలను 1, ఉండి 1, ఆకివీడు 1 



ఏలూరు, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పశ్చిమ ఉలిక్కి పడింది. నిన్నటి వరకు ప్రశాంతంగావున్న జిల్లా.. ఒక్క రోజులో 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావ డంతో ప్రజలు చెందారు. దీంతో అధికార యంతాంగ్రం అప్రమత్తమైంది. రాబోయే 48 గంటలు కీలక సమయంగా భావించింది. జిల్లా నలుమూలలా కరోనా అనుమాని తులను గుర్తించే పనిలో పడింది. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారి సన్నిహితులు, బంధువులను జల్లెడ పడుతున్నారు. అనుమానం వస్తే హోం క్వారంటైన్‌లో ఉంచు తున్నారు. 80 మందిని ఆశ్రం మెడికల్‌ కళాశాలలో ప్రత్యేక క్వారంటైన్‌ ఏర్పాటు చేశారు. వీరిలో 67 మంది కాంట్రాక్ట్‌ కేసులు, 13 మంది అనుమానిత కేసులు. 


జిల్లాలో దాదాపు 30 మంది ఢిల్లీ వెళ్లినట్టు గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్‌గాను, పది మందికి నెగిటివ్‌గాను నిర్ధారించారు. మిగిలిన ఆరుగురితోపాటు మిగిలిన అనుమానితుల నమూనాలను పరీక్షలకు పంపారు. గురు వారానికి రిపోర్టులు రానున్నాయి. ఏలూరు నగర పరిధిలోని తంగెళ్లమూడికి చెందిన కొందరికి ఢిల్లీతో కనెక్షన్‌ ఉన్నట్లు గుర్తించారు. వారికి పరీక్షలు నిర్వహించగా ఏడు గురికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. భీమవరం, పెనుగొండలలో ఇద్దరేసి, గుండుగొలను, ఉండి, ఆకివీడులలో ఒక్కరు చొప్పున నమోదయ్యాయి. వీరందరినీ ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చేర్చారు. అయితే తాము ఇళ్లు కదలకుండా ఉన్నామని, ఎందుకు తమను ఆసుపత్రిలో చేరుస్తున్నారని తొలుత కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్సలు కొనసాగుతు న్నాయి. పాజిటివ్‌ వచ్చిన వారి బంధువులు, ఆత్మీయులు, సన్నిహితులను క్వారం టైన్‌లో చేరుస్తున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ఇక్కడ చేర్చారు.


బుధవారం పొద్దుపోయే నాటికి వీరి సంఖ్య దాదాపు వందకు సమీపంలో ఉంది. ఆశ్రం మెడికల్‌ కళాశాలలో కరోనా అను మానితులకు వైద్యం సమకూర్చే విషయంలో తగిన ముందుజాగ్రత్తలు కల్పించలేక పోయారనే వాదన ఉంది. దీనిపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. తాడేపల్లిగూడెంకు చెందిన దాదాపు 11 మంది కరోనా అనుమానితులను గుర్తించారు. వీరిలో పది మంది ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు కాగా, మరొకరు ఇటీవలే లండన్‌ నుంచి తిరిగి వచ్చి నట్టు సమాచారం. వీరందరినీ క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. నరసాపురంలో ఆరు గురు అనుమానితులను గుర్తించగా, వీరిలో ఇద్దరు ఏలూరు నగరవాసులతో సన్ని హిత సంబంధాలు కొనసాగించారని గుర్తించి, వారిని ఏలూరు లోనే ఉంచారు. మిగి లిన నలుగురిని పాలకొల్లు క్వారంటైన్‌లో చేర్చారు. నల్లజర్లకు చెందిన మరో అను మానితుడిని, జంగారెడ్డిగూడెంకు చెందిన ఇంకొకరిని ఏలూరుకు చేర్చారు. ఉంగు టూరు మండలానికి చెందిన వ్యక్తికి తొలుత పాజిటివ్‌గా నిర్ధారణ అయినా బుధ వారం నాటికి పూర్తిస్థాయి నివేదికలో నెగెటివ్‌ వచ్చింది. 


సగం మంది ఏలూరు వాసులే

జిల్లావ్యాప్తంగా బయటపడిన పాజిటివ్‌ కేసుల్లో సగం మంది ఏలూరు వారే కావడంతో కలకలం రేగింది. వీరంతా ఎవరెవరుతో సన్నిహితంగా మెలిగారు ? ఎక్కడెక్కడ సంచరించారనే వివరాలను సేకరిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే కొందరు వ్యక్తిగత పనుల్లో నిమగ్నం కావడం, మరికొందరు మాంసం దుకాణాలు నిర్వహించారు. ఇంకొందరు నగరంలోని వివిధ ముస్లిం ప్రార్థనా స్థలాల్లో కొందరితో భేటీ అయినట్టు ప్రాథమికంగా బయటపడింది. తంగెళ్లమూడి ప్రాంతాన్ని ఇప్పటికే రెడ్‌జోన్‌గా ప్రకటించి యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ప్రత్యేక బృందాలు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నాయి. భీమవరంలో రెండు కేసులు బయటపడటంతో ఈ ప్రాంతంతోపాటు ముందస్తుగా నరసాపురాన్ని రెడ్‌ జోన్‌గా ప్రకటించారు.  


మరింత పెరిగేనా ?

ఇప్పటికే కరోనా అనుమానితుల సంఖ్య మరింత పెరుగుతుండగా, దీనికితోడు పాజిటివ్‌ కేసుల సంఖ్య దీనికనుగుణంగానే ఉండబోతున్నట్టు ఒక అంచనాకు వచ్చారు. వ్యాధి లక్షణాలు బయటపడకపోగా, పరీక్షల్లో మాత్రం పాజిటివ్‌ రావడం వంటి కోణంలో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగానే అనుమానిస్తున్నారు.  కరోనా పాజిటివ్‌కు సంబంధించి తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం, జలుబు వంటి ప్రాథమిక లక్షణాలు కనిపించకపోవడంతో ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే వీరంతా వ్యక్తిగత కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఇప్పుడదే కొంపముంచింది. కరోనా వ్యాధి లక్షణాలు అంతర్గతంగా పెరిగిపోగా, వైద్య పరీక్షల్లోనూ పాజిటివ్‌గా వచ్చింది. సాధారణంగా కరోనా లక్షణాలు ఎలా ఉంటాయో విస్తృతంగా ప్రచారం చేశారు.


ఆ ప్రచారానికి లోబడే అలాంటి లక్షణాలు ఉంటే కరోనా సోకినట్టు లేదంటే లేదన్నట్టు ఇప్పుడి వరకు వ్యవహరించారు. తాజాగా పాజిటివ్‌ నిర్ధారణ అయిన రోగులకు సంబంధించి లక్షణాలు బహిర్గతం కాకపోవడంపై వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైద్య పరీక్షల్లో మాత్రం పాజిటివ్‌గా రావడానికి తోడు ఐసోలేషన్‌ వార్డుల్లోనూ వీరి కదలికలు చురుగ్గానే ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అందువల్ల అనుమానం ఉంటే ఎవరికైనా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలే తప్ప మౌనంగా ఉండడం తగదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 30 మంది అనుమానితులను గుర్తించిన సమయంలోనూ ఇలాంటి సందేహాలెన్నో బయటపడ్డాయి. 

Updated Date - 2020-04-02T11:38:18+05:30 IST