వదలని వైరస్‌

ABN , First Publish Date - 2020-08-09T06:28:33+05:30 IST

ఉమ్మడి పాలమూరును వైరస్‌ వదిలివెళ్లడం లేదు. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగూతూనే..

వదలని వైరస్‌

  • ప్రతిరోజూ వందల సంఖ్యలో నమోదవుతున్న కేసులు
  • ఉమ్మడి పాలమూరులో కొత్తగా 293 మందికి పాజిటివ్‌

మహబూబ్‌నగర్‌, వనపర్తి (వైద్యవిభాగం)/ జడ్చర్ల/ గద్వాలక్రైం/ నారాయణపేట క్రైం/  ఆగస్ట్‌ 8 : ఉమ్మడి పాలమూరును వైరస్‌ వదిలివెళ్లడం లేదు. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగూతూనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో శనివారం కొత్తగా 293 మందికి వైరస్‌ సోకింది. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. 


మహబూబ్‌నగర్‌ జిల్లాలో శనివారం 79 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో జిల్లా కేంద్రంలో 49 మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. జడ్చర్లలో 22 మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. వారిలో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. రాజాపూర్‌ మండలం ముదిరెడ్డిపల్లిలో ఒకటి, అడ్డాకుల మండలం కందూరులో ఒకటి, బాలనాగర్‌లో ఒకటి, నందారంలో ఒకటి, దేవరకద్ర మండలం గుడిబండలో ఒకటి, కోయిల్‌కొండలో ఒకటి, హన్వాడ మండలంలోని చిన్నదర్‌పల్లిలో ఒకటి, నవాబ్‌పేట మండలం కొరకొండలో ఒక్క కేసు నమోదయ్యింది. జిల్లా కేంద్రంలోని వీరన్న పేటలో 55 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. 


జోగుళాంబ గద్వాల జిల్లాలో శనివారం 138 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. పట్టణంలోని ర్యాపిడ్‌, కోవిడ్‌ ల్యాబ్‌లలో నిర్వహించిన పరీక్షల్లో 33 మందికి పాజిటివ్‌ వచ్చింది. అందులో పట్టణంలోనే 25 మంది బాధితులున్నారు. ఇటిక్యాల పాడులో ఒకరికి, ధరూర్‌ పీహెచ్‌సీలో ఒకరికి, వడ్డేపల్లిలో ఒకరికి, మేకలసోంపల్లిలో ఒకరికి, జమ్మిచేడులో ఒకరికి, అయిజలో ఒకరికి వైరస్‌ సోకింది. కాగా వనపర్తికి చెందిన వారు ఇద్దరికి కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ధరూర్‌లో నాలుగు, గట్టులో 14, మల్ధకల్‌లో రెండు, ఇటిక్యాలలో రెండు, క్యాతూరులో రెండు, మానోపాడులో 14, అయిజలో 15, వడ్డేపల్లిలో 23, రాజోలీలో ఐదు, అలంపూర్‌లో 24 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 


వనపర్తి జిల్లాలో శనివారం 48 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో వనపర్తి పట్టణంలోనే 17 కేసులు నమోదు కాగా, కొత్తకోటలో ఆరు, వీపన్‌గండ్లలో రెండు, రేవల్లిలో ఒకటి, అమరచింతలో నాలుగు, ఆత్మకూర్‌లో నాలుగు, పెబ్బేరులో ఐదు, గోపాల్‌పేటలో రెండు, చిన్నంబావిలో ఒకటి, పెద్దమందడిలో ఐదు, పాన్‌గల్‌ మండలంలో ఒక కేసు నమోదయ్యింది. 


నారాయణపేట జిల్లాలో శనివారం మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో మక్తల్‌లో ఒకరికి,  కర్నిలో మరొకరికి, ఊట్కూరులో ఇంకొకరికి వైరస్‌ సోకింది. 

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 25 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అందులో ఎక్కువగా అచ్చంపేట పట్టణంలో ఆరు కేసులు నమోదవగా, కల్వకుర్తిలో నాలుగు కేసులు వచ్చాయి. మిగతా కేసులు వివిధ మండలాల్లో నమోదయ్యాయి. 

Updated Date - 2020-08-09T06:28:33+05:30 IST