ఏపీలో డేంజర్ బెల్స్

ABN , First Publish Date - 2020-04-09T00:34:06+05:30 IST

కరోనాపై వస్తున్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. మూడవ దశ ప్రారంభంలో ఉన్నామని అధికార యంత్రాంగం చెబుతుండటంతో....

ఏపీలో డేంజర్ బెల్స్

అమరావతి: కరోనాపై వస్తున్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. మూడవ దశ ప్రారంభంలో ఉన్నామని అధికార యంత్రాంగం చెబుతుండటంతో ఏపీలో కలకలం రేగింది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం రాయలసీమలోని మూడు జిల్లాలు, నెల్లూరుతో పాటు కోస్తాలోని రెండు జిల్లాల్లో పెరుగుతున్న పాజిటివ్ కేసులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతూ వైరస్ వ్యాప్తి మూడో దశకు చేరుకుంది. కరోనా వైరస్ దశలో నాలుగు దశలుంటాయి. మొదటి దశలో విదేశాల నుంచి వారికి వైరస్ సోకడం, రెండవ దశలో వారి నుంచి కుటుంబ సభ్యులకు విస్తరించడం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి కుటుంబ సభ్యులకు విస్తరించింది. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి, వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా వైరస్ సోకింది. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన విజయవాడకు చెందిన వ్యక్తి నుంచి కుటుంబంలోని మిగతా ఆరుగురికి కూడా ఈ వైరస్ విస్తరించింది. ఢిల్లీ వెళ్లి వచ్చిన ఆ కుటుంబంలోని వ్యక్తి తండ్రి మరణించాడు. 

Updated Date - 2020-04-09T00:34:06+05:30 IST