కరోనా పాలసీల గడువు పెంపు?

ABN , First Publish Date - 2020-09-18T06:14:23+05:30 IST

కరోనా కవచ్‌, కరోనా రక్షక్‌ గడువు పెంచే విషయాన్ని ఐఆర్‌డీఏఐ పరిశీలిస్తోంది...

కరోనా పాలసీల గడువు పెంపు?

  • ఐఆర్‌డీఏఐ పరిశీలన


న్యూఢిల్లీ: కరోనా కాటు నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ప్రవేశపెట్టిన బీమా పాలసీలు.. కరోనా కవచ్‌, కరోనా రక్షక్‌  గడువు  పెంచే విషయాన్ని ఐఆర్‌డీఏఐ పరిశీలిస్తోంది. కరోనా వ్యాక్సిన్‌ రావడానికి మరికొంత సమ యం పట్టే అవకాశం ఉండటంతో తాము ఈ అంశం పరిశీలిస్తున్నామని, సరైన సమయంలో ఈ నిర్ణయం తీసుకుంటామని ఐఆర్‌డీఏఐ చైర్మన్‌ సుభాష్‌ ఖుంతియా   తెలిపారు. అలాగే భారీ పత్రాలతో పని లేకుండా ప్రజలు తేలిగ్గా అర్ధం చేసుకోగల విధంగా కరోనా ప్రామాణిక పాలసీ ప్రవేశపెట్టే అంశం కూడా పరిశీలిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. జూలై 10వ తేదీన జనరల్‌, ఆరోగ్య బీమా రంగాల్లోని కంపెనీలు ప్రవేశపెట్టిన కరోనా కవచ్‌ ఆస్పత్రి వ్యయాలకు కవరేజీ కల్పిస్తోంది. దీని కాలపరిమితి మూడున్నర నెలల నుంచి గరిష్ఠంగా 9 నెలలుంది.

Updated Date - 2020-09-18T06:14:23+05:30 IST