Abn logo
Jul 5 2020 @ 15:12PM

ఒంగోలు జీజీహెచ్ ఐసోలేషన్‌లో కరోనా పేషెంట్ల ఆకలి కేకలు

ప్రకాశం: ఒంగోలు జీజీహెచ్ ఐసోలేషన్‌లో కరోనా పేషెంట్ల ఆకలి కేకలు వేస్తున్నారు. రాళ్లలాంటి ఇడ్లీలు, పాచిపోయిన అన్నం పెడుతున్నారని రోగులు వాపోతున్నారు. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల ఆహారంతో కాంట్రాక్టర్లు వ్యాపారం చేస్తున్నారు. కరోనాతో మరణం వస్తుందో లేదో తెలియదు కానీ.. జీజీహెచ్‌లో పరిస్థితులు మాత్రం నరకం కంటే ఘోరంగా ఉన్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement