కరోనా రోగులు బోర్లా పడుకుంటే శ్వాస సమస్యలు ఉండవు

ABN , First Publish Date - 2020-03-26T08:12:06+05:30 IST

ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న కొవిడ్‌-19 రోగుల్లో చాలామంది సరిగ్గా శ్వాస పీల్చుకోలేక ఇబ్బందిపడుతుంటారు. వూహాన్‌లోని జిన్‌యింటాన్‌ ఆస్పత్రికి చెందిన వైద్యుల బృందం 12

కరోనా రోగులు బోర్లా పడుకుంటే  శ్వాస సమస్యలు ఉండవు

బీజింగ్‌, మార్చి 25 : ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న కొవిడ్‌-19 రోగుల్లో చాలామంది సరిగ్గా శ్వాస పీల్చుకోలేక ఇబ్బందిపడుతుంటారు. వూహాన్‌లోని జిన్‌యింటాన్‌ ఆస్పత్రికి చెందిన వైద్యుల బృందం 12 మంది కొవిడ్‌-19 పాజిటివ్‌ రోగులపై అధ్యయనం అనంతరం ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు. బాధితులు తలకిందికి వంచి, మంచంపై బోర్లా పడుకుంటే శ్వాస తీసుకోవడంలో ఎలాంటి అవరోధాలు ఎదురుకావడం లేదని గుర్తించారు. ఈ భంగిమలో రోగి నిద్రించినప్పుడు శ్వాసనాళాల ద్వా రా రెండు ఊపిరితిత్తుల్లోకి గాలి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవేశిస్తోందని తెలిపారు.

Updated Date - 2020-03-26T08:12:06+05:30 IST