భోపాల్‌లో కరోనా రోగిపై అత్యాచారం

ABN , First Publish Date - 2021-05-15T07:22:55+05:30 IST

భోపాల్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగిపై అక్కడి వార్డ్‌ బాయ్‌ అత్యాచారానికి ఒడిగట్టాడు. పరిస్థితి విషమించడంతో ఘటన జరిగిన 24 గంటల్లోనే ఆమె కన్నుమూసింది

భోపాల్‌లో కరోనా రోగిపై అత్యాచారం

నెలన్నర క్రితం ఘటన.. నిందితుడి అరెస్టు! 


భోపాల్‌, మే 14: భోపాల్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగిపై అక్కడి వార్డ్‌ బాయ్‌ అత్యాచారానికి ఒడిగట్టాడు. పరిస్థితి విషమించడంతో ఘటన జరిగిన 24 గంటల్లోనే ఆమె కన్నుమూసింది. బాధితురాలిని 1984లో భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన నుంచి బయటపడిన 43 ఏళ్ల మహిళగా గుర్తించారు! భోపాల్‌లోని భోపాల్‌ మెమోరియల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో ఏప్రిల్‌ 6న ఈ ఘటన జరిగింది. ఆస్పత్రిలోని ఓ వైద్యుడికి తన పట్ల జరిగిన ఘోరాన్ని బాధితురాలు చెప్పుకొంది. ఆమె చెప్పిన వివరాలన్నీ ఆ వైద్యుడు రి కార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితురాలి ఆరోగ్యం విషమించడంతో ఆ మరుసటి రోజే ఆమె కన్నుమూసింది. బాధితురాలు ఇ చ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా నిందితుడిని 40 ఏళ్ల సంతోష్‌ అహిర్వార్‌గా గు ర్తించి అదే రోజు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను తొక్కిపెట్టేందుకు ఆస్పత్రి నిర్వాహకులు ప్రయత్నించారని.. ఇందులో భాగంగానే బాధితురాలి కుటుంబసభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. అయి తే.. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన నాటి బాధితులు, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి ఒత్తిడి చేయడంతోనే వెలుగులోకి వచ్చిందని అంటున్నారు.  

Updated Date - 2021-05-15T07:22:55+05:30 IST