కరోనాతో ఆస్పత్రిలో చేరిన అన్నను చూసేందుకు వెళ్తే..మృతదేహాన్ని చూపించారు

ABN , First Publish Date - 2020-08-04T21:57:11+05:30 IST

కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినా సమాచారం ఇవ్వలేదని ప్రక్కిలంకలో మృతుడి బంధువులు, స్థానికులు సోమవారం

కరోనాతో ఆస్పత్రిలో చేరిన అన్నను చూసేందుకు వెళ్తే..మృతదేహాన్ని చూపించారు

ఆస్పత్రిలో చనిపోయిన సమాచారం ఇవ్వలేదు..

ప్రక్కిలంకలో బంధువుల ఆందోళన


తాళ్లపూడి(పశ్చిమ గోదావరి) : కరోనా పాజిటివ్‌తో  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినా సమాచారం ఇవ్వలేదని ప్రక్కిలంకలో మృతుడి బంధువులు, స్థానికులు సోమవారం ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన ఒక యువకుడికి పాజిటివ్‌ రావడంతో ఇటీవల ఏలూరు ఆశ్రం కొవిడ్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అయితే చనిపోయిన సమాచారం కుటుంబ సభ్యులకు తెలియదు. ఆస్పత్రిలో ఉన్న అన్నను చూసేందుకు అతని తమ్ముడు ఆస్పత్రికి రాగా ఆస్పత్రి సిబ్బంది సరైన సమాధానం చెప్పకుండా ఇబ్బందులు పెట్టి నాలుగు గంటల తర్వాత మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూపారని బంధువులు ఆరోపించారు. తన సోదరుడి ఫోన్‌ను మాయంజేశారని మృతుడి తమ్ముడు వాపోయాడు. సరైన వైద్యం అందకపోవడం వల్లే తన అన్న చనిపోయాడని అతను ఆరోపించాడు. ఈ మేరకు సోమవారం ప్రక్కిలంకలో బంధువులు, గ్రామస్థులు కొద్దిసేపు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు. కంటైన్మెంట్‌లు ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరికాదని పలువురు గ్రామస్థులు పేర్కొన్నారు.

Updated Date - 2020-08-04T21:57:11+05:30 IST